ఇప్పుడు హార్రర్, హార్రర్ కామెడీ సినిమాలు తీసే దర్శకులు చాలామంది ఉన్నారు. ఐతే ఒకప్పుడు హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసిన ‘రాత్రి’ సినిమా మామూలు సంచలనం రేపలేదు. ప్రేక్షకులను థియేటర్లలో వణికించేసి.. భయంతో పారిపోయేలా చేసిన సినిమా ఇది. అదే కాక దెయ్యం, భూత్, కౌన్, ఫూంక్, ఫూంక్-2.. ఇలా హార్రర్ జానర్లో చాలా సినిమాలే చేశాడు వర్మ. అందుకేనేమో తమిళ అనువాద చిత్రం ‘డిమాంటి కాలనీ-2’కు సంబంధించిన తెలుగు ప్రమోషనల్ ఈవెంట్‌కు వర్మను ముఖ్య అతిథిగా పిలిచింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘డిమాంటి కాలనీ’ సినిమా తీసినపుడు ఆ పేరుతో చెన్నైలో ఓ కాలనీ ఉండడంతో టైటిల్ విషయంలో ఇబ్బంది పడినట్లు తనకు చెప్పాడని తెలిపాడు. మరి ‘డిమాంటి కాలనీ’ రిలీజయ్యాక ఆ కాలనీ వాళ్లంతా చెన్నై నుంచి వెళ్లిపోయారో లేదో తెలియదన్నాడు. కానీ తాను ‘భూత్’ సినిమాలో ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్లో తీశానని.. ఆ తర్వాత ఆ అపార్ట్‌మెంట్ అంటే అందరికీ భయం పట్టుకుందని.. దీంతో తర్వాత ఎవ్వరూ దాన్ని కొనడానికి ముందుకు రాలేదని వర్మ తెలిపాడు. ఇప్పటికీ ముంబయిలో ఆ అపార్ట్‌మెంట్ అమ్ముడవకుండా అలాగే ఉండిపోయిందని వర్మ ఆశ్చర్యకర విషయం వెల్లడించాడు.
‘డిమాంటి కాలనీ-2’ తమిళ వెర్షన్ గురించి తాను చాలా మంచి విషయాలు విన్నానని.. తమిళంలో మాదిరే తెలుగులోనూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానని.. ఈ మధ్య చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయని వర్మ పేర్కొన్నాడు. అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ‘డిమాంటి కాలనీ-2’ తమిళంలో ఆల్రెడీ హిట్ అయింది. శుక్రవారం తెలుగులో విడుదల కానుంది.
This post was last modified on August 22, 2024 10:01 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…