హీరోల కొడుకులు హీరోలవుతారు. స్టార్లుగా ఎదుగుతారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల కొడుకులు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అలాంటి పాత్రలే చేయడం, తండ్రి స్థాయిని అందుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. లెజెండరీ నటుడు రావు గోపాల్రావు తనయుడు రావు రమేష్ ఈ అరుదైన జాబితాలోకే వస్తారు.
విశేషం ఏంటంటే.. రావు గోపాల్రావు జీవించి ఉండగా రావు రమేష్ నటనలోకి అడుగుపెట్టలేదు. ఆయన మరణానంతరం కూడా తండ్రి పేరు చెప్పుకుని సినిమాల్లోకి రాలేదు. ఒక కొత్త నటుడిలాగే వచ్చాడు. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి నటుడిగా గొప్ప స్థాయిని అందుకుని బిజీ ఆర్టిస్టుల్లో ఒకడయ్యాడు. ఐతే ఎంత ఎదిగినా ఒదిగే ఉండే రావు రమేష్ మీడియాలో పెద్దగా కనిపించరు. సోషల్ మీడియాలో అయితే అసలే ఉండరు. రావు రమేష్ ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం.
కాగా తాను తొలిసారి లీడ్ రోల్ చేసిన ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన రావు రమేష్‌కు యాంకర్ సుమ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇంత పాపులర్ నటుడైన మీరు సోషల్ మీడియాలో ఎందుకు లేరు అని ప్రశ్నించిందామె. దానికాయన బదులిస్తూ.. “మన పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరైన వ్యక్తి తమ దగ్గర లేని విలువైంది ఒకటి మీ దగ్గర ఉంది అని చెప్పాడు. అదే.. ప్రైవసీ. సోషల్ మీడియాలో ఉండడం ద్వారా తాము ప్రైవసీ కోల్పోయామని.. మీకు ఆ సమస్య లేదని ఆయనన్నాడు. సోషల్ మీడియాలోకి వస్తే ప్రైవసీ, ప్రశాంతత రెండూ కోల్పోతామనే నేను అందులోకి రాలేదు” అని రావు రమేష్ చెప్పాడు.
ఐతే మీరు మాత్రం అలా ప్రశాంతంగా ఎలా ఉంటారు.. సోషల్ మీడియాలోకి రావాల్సిందే అంటూ సుమ సరదాగా పట్టుబట్టగా.. ఐతే త్వరలోనే వచ్చేస్తా అని రావు రమేష్ చెప్పడం విశేషం. ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on %s = human-readable time difference 9:53 am
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…