Movie News

చదవాల్సిన పుస్తకం ‘చిరంజీవి’ జీవితం

ఒక హీరో నాలుగు దశాబ్దాలకు పైగా చెరగని ముద్ర వేయడమే కాదు ఏడు పదుల వయసుకి దగ్గర ఉన్నా ఇంకా అదే తపనతో నటించడం, కెమెరా ముందు చెమట చిందించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందుకే యాక్టర్స్ ఎందరు ఉన్నా లెజెండ్స్ కొందరే అవుతారు. ఆ ముందు వరసలో ఉండే పేరే చిరంజీవి. ప్రాణం ఖరీదు (1978) తో సినీ రంగప్రవేశం చేసినప్పుడు తనతో పాటు పరిచయమవుతున్న కుర్రాడు ఇంకొన్నేళ్లలో తెరను ఏలతాడని కోట శ్రీనివాసరావు ఊహించి ఉండరు. మా ఊరి పాండవులు షూటింగ్ టైంలో కృష్ణంరాజు, మురళీమోహన్ చిరు కళ్ళలో కసిని చూసి భవిష్యత్తుని ఈ స్థాయిలో అంచనా వేయలేదు.

హీరో, విలన్ గా అన్ని తరహా వేషాలతో ఆకట్టుకున్న చిరంజీవి ఖైదీ (1983) అనే బ్లాక్ బస్టర్ ద్వారా ఒకే దెబ్బతో యువతకు ఐకాన్ గా మారడం చూసి తలలు పండిన సీనియర్ హీరోలు ఆశ్చర్యపోయేలా చేసింది. బాడీలో స్ప్రింగులు ఉన్నాయా అనిపించేలా డాన్సులు వేగంగా చేయడం చూసి మాస్ వెర్రెత్తిపోయారు. ఛాలెంజ్ (1984) ద్వారా నిరాశలో ఉన్నవాళ్లకు స్ఫూర్తినిస్తే విజేత (1985) తో కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. పసివాడి ప్రాణం (1987) లాంటి చైల్డ్ సెంటిమెంట్ మూవీతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం చరిత్రగా చెప్పుకున్నారు. మాస్ మొగుడుకి పర్యాయపదంగా మార్చుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రాన్ని తుఫాను ముంచేసినప్పుడు మోకాలి లోతు థియేటర్లలో కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టడం జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) సాధ్యం చేసి చూపించింది. ఫ్యామిలీ కంటెంట్ లో మాస్ ఎలిమెంట్స్ జొప్పిస్తే కనక వర్షం ఖాయమని గ్యాంగ్ లీడర్ (1991) నిరూపిస్తే ఘరానా మొగుడు (1992) బాక్సాఫీస్ కి తొలి పది కోట్ల గ్రాసర్ గా కొత్త గ్రామర్ గా నేర్పించింది. మధ్యలో కొన్ని ఫ్లాపులు బ్రేక్ ఇస్తే అయిదుగురు చెల్లెళ్ళకు అన్నయ్యగా హిట్లర్ (1997) తో కంబ్యాక్ ఇవ్వడం అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు సైతం మర్చిపోలేరు. అక్కడి నుంచి అప్రతిహత జైత్ర యాత్ర కొనసాగింది.

డాడీ, మృగరాజు లాంటి స్పీడ్ బ్రేకర్లు అడ్డుతగిలినా తిరిగి ఇంద్ర (2002) తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించడం గురించి పేజీల కొద్దీ రాయొచ్చు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన కోసం శంకర్ దాదా జిందాబాద్ (2008) తర్వాత ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్న చిరంజీవి తిరిగి ఖైదీ నెంబర్ 150 (2017) తో బలమైన కంబ్యాక్ ఇవ్వడం ఫ్యాన్స్ మర్చిపోలేని జ్ఞాపకం. చిరకాల వాంఛ సైరా నరసింహారెడ్డి (2019) ని తెరమీద చూసుకోవడం ఆయన సాధించిన మరో మైలురాయి. వాల్తేరు వీరయ్య (2022) బ్లాక్ బస్టర్ ద్వారా విజయాల తృష్ణ తనలో ఇంకా తీరలేదని నిరూపించారు.

సినిమాలన్నీ ఒక ఎత్తయితే రక్తదానం, నేత్రదానం గురించి జనంలో పెద్ద ఎత్తున అవగాహన తీసుకొచ్చిలక్షలాది జీవితాల్లో వెలుగు నింపేందుకు చిరంజీవి కారణమయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా అనుభవం గడిచినప్పటికీ రాజకీయాల్లో మాత్రం కొనసాగలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఆయన కీర్తి కిరీటానికి మచ్చు తునకలు. హీరోని మించి ఒక వ్యక్తిగా వ్యక్తిత్వంతో ఆకట్టుకునే చిరంజీవి ఎక్కిదిగని ఎత్తుపల్లాలు లేవు. చూడని జయాపజయాలు లేవు. అందుకే ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఈ ‘చిరు’  జీవితం. 

This post was last modified on August 22, 2024 7:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

4 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

5 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

5 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

6 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

7 hours ago