పుష్ప 2 ది రూల్ పూర్తి చేయడం మీద ఎంత ఒత్తిడి ఉందో దర్శకుడు సుకుమార్ మాటల్లో అర్థమవుతోంది. నిన్న జరిగిన మారుతినగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ప్రసంగం మొదలుపెట్టే సమయంలో అల్లు అర్జున్ అభిమానులు బాగా అరిచేశారు.
పుష్ప 2 క్లైమాక్స్ తీస్తున్నామని, ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది పడాలని చెప్పడం చూస్తే ఎంత ప్రెజర్ ఉందో తేటతెల్లమవుతోంది. ఆ మధ్య హీరో దర్శకుడి మధ్య ఏదో విభేదం వచ్చిందని, దాని వల్లే బన్నీ గెడ్డం తీశాడని పలురకాల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నిన్న ఆ మబ్బులన్నీ వీడిపోయాయి. వీళ్ళ బాండింగ్ మరోసారి బయటపడింది.
ఇంకొన్ని కబుర్లు కూడా సుకుమార్ పంచుకున్నారు. పుష్ప 2తో ఆగదని ఇంకో అయిదారు భాగాలు తీస్తామని సరదాగా అన్నారు. పక్కనే షాక్ తిన్నట్టుగా ఉన్న బన్నీ ఎక్స్ ప్రెషన్ చూడాలి.
అల్లు అర్జున్ సైతం తన స్పీచ్ లో డిసెంబర్ 6 తగ్గేదేలే అంటూ ప్రత్యేకంగా ఎలివేషన్లు ఇవ్వడం ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహాన్ని తెచ్చింది. మాములుగా తన సినిమాల గురించి మాట్లాడేందుకు భయపడతానని కానీ ఈసారి అలా కాదని చెబుతూ ఇకపై ఇప్పట్లా కాకుండా వేగంగా ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తానని చెప్పడంలో పుష్ప ఆలస్యానికి చింతిస్తున్న పరమార్ధం వినిపించింది.
పేరుకి రావు రమేష్ మూవీ ఈవెంట్ అయినా సోషల్ మీడియాలో పుష్ప ముచ్చట్లు, అల్లు అర్జున్ స్పీచ్ తోనే హాట్ డిస్కషన్లు జరిగిపోయాయి. దీని వల్ల మారుతినగర్ సుబ్రహ్మణ్యంకు ఎలాంటి మైలేజ్ వస్తుందో చూడాలి.
పెద్దగా చెప్పుకునే కొత్త చిత్రాలు లేకపోవడంతో టాక్ కనక బాగా వస్తే మంచి వసూళ్లను ఆశించవచ్చు. లక్కీగా ఇంద్ర రీ రిలీజ్ గురువారమే జరగడం మరో కలిసి వచ్చే అంశం. ఆ హడావిడి రేపటికి దాదాపుగా తగ్గిపోతుంది. పోటీ లేని అవకాశాన్ని ఎలా వాడుకుంటారో చూడాలి. డబ్బింగ్ మూవీ డిమాంటి కాలనీ 2 తప్ప ప్రత్యేకంగా ఆడియన్స్ దృష్టిలో ఇంకేం లేవు.
This post was last modified on August 22, 2024 7:46 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…