తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నేతలు, వారికి అనుకూలంగా ఉన్నవాళ్లుె గత పదేళ్ల వ్యవధిలో చేసిన అక్రమాల మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. కాళేశ్వరం సహా పలు అంశాల్లో కేసీఆర్ అండ్ కోను ఇరుకున పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది.
అంతే కాక హైదరాబాద్‌లో గత ప్రభుత్వ మద్దతుగా సాగిన అక్రమ కట్టడాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్ దూకుడుగా వ్యవహరిస్తోంది. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. తాజాగా కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. ఐతే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం కూడా తెలిసిన సంగతే.
ఇదిలా ఉంటే కొందరు సెలబ్రెటీలు అక్రమంగా నిర్మించిన కట్టడాల మీద కూడా హైడ్రా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అందులో అక్కినేని నాగార్జుకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కన్వెన్షన్ సెంటర్ మీద ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రాకు ఎప్పట్నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. గతంలోనే దీనిపై చర్యలకు ఉపక్రమించారని.. కానీ మధ్యలో ఆపేశారని.. ఇప్పుడు దీని మీద దృష్టిసారించాలంటూ ఇది అక్రమ కట్టడం అనడానికి రుజువులు కూడా చూపిస్తోంది జనం కోసం సంస్థ.
నాగార్జున గతంలో ప్రభుత్వ అధినేతలకు సన్నిహితంగా మెలగడం ద్వారా కన్వెన్షన్ సెంటర్‌కు ఇబ్బంది రాకుండా చూసుకున్నారని ఈ సంస్థ ఆరోపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి సర్కారు ఒక పెద్ద సెలబ్రెటీకి చెందిన కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేంత సాహసం చేస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్న.
This post was last modified on August 21, 2024 4:57 pm
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…