టాలీవుడ్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే ముందు వరసలో తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి ఒకరిద్దరి పేర్లే ఎక్కువ హైలైట్ అవుతున్నప్పటికీ క్రమంగా ఈ ట్రెండ్ లో మార్పొస్తోంది. ఇతర భాషల నుంచి మ్యూజిక్ డైరెక్టర్లు తమదైన ముద్ర వేసేందుకు బలంగా ప్రయత్నిస్తున్నారు. కల్కి 2898 ఏడి లాంటి భారీ భాద్యత నాగ్ అశ్విన్ కోరిమరీ సంతోష్ నారాయణన్ చేతిలో పెట్టడానికి కారణం అదే. సలార్ కి స్కోర్ ఇచ్చింది శాండల్ వుడ్ లో పేరొందిన రవి బస్రూర్. ఇప్పుడదే తరహాలో జేక్స్ బెజోయ్ పేరు మారుమ్రోగుతుందని న్యాచురల్ స్టార్ నాని వ్యక్తం చేస్తున్న నమ్మకం బలంగా ఉంది.
ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారంకి అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు థియేటర్లను మ్యూజిక్ కన్సర్ట్ లా మార్చేస్తాయని చెప్పడం చూస్తే అవుట్ ఫుట్ ఓ రేంజ్ లో వచ్చిందని అర్థమవుతోంది. శాంపిల్ ఆల్రెడీ ట్రైలర్ లో చూసేశాం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ నిజమే అనిపిస్తోంది. ఆ మధ్య విశ్వక్ సేన్ సైతం తన మెకానిక్ రాకీకి జేక్స్ బెజోయ్ ఇచ్చిన ఆల్బమ్ గురించి చెబుతూ కెరీర్ లో బెస్ట్ అవుతుందనే రేంజ్ లో ఊరించాడు. ఈ స్థాయిలో రిలీజ్ కు ముందు టాలీవుడ్ హీరోలతో ప్రశంసలు అందుకున్న పక్క రాష్ట్రం సంగీత దర్శకులు ఈ మధ్య కాలంలో అయితే లేరు.
అయితే జేక్స్ బెజోయ్ తెలుగులో పని చేయడం ఇది మొదటిసారి కాదు. విజయ్ దేవరకొండ టాక్సీ వాలాతోనే రుజువు చేసుకున్నాడు. చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఒకే ఒక జీవితం మంచి హిట్ అందుకుంది. ఎన్ని ఆఫర్లు వస్తున్నా మలయాళంలో విపరీతమైన బిజీగా ఉండటంతో ఎక్కువ టాలీవుడ్ సినిమాలు చేయడం లేదు. ఇతని విడుదల కావాల్సిన మల్లువుడ్ చిత్రాలు పది దాకా ఉన్నాయంటేనే డిమాండ్ ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. నాని చెప్పింది కనక నిజమే అయితే మాత్రం జేక్స్ బెజోయ్ హ్యాపీగా ఇక్కడే సెటిలైపోయేలా ప్లాన్ చేసుకోవచ్చు.
This post was last modified on August 21, 2024 3:11 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…