పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది చివర్లో తన చేతిలో ఉన్న మూడు చిత్రాల షూటింగ్‌ను హోల్డ్‌లో పెట్టేసి.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ అయిపోయారు. ఎన్నికలు అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత డిప్యూటీ హోం మినిస్టర్‌గా, నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆ వ్యవహారాల్లో తలమునకలు అయిపోయారు జనసేన అధినేత.
ఐతే మధ్యలో ఆగిన తన చిత్రాలను ఎప్పుడు పూర్తి చేస్తారా అని ఆయా చిత్రాల నిర్మాతలతో పాటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక మూడు నెలలు అయినా పని చేయనివ్వండి, తర్వాత వీలును చూసుకుని సినిమాలు పూర్తి చేస్తా అంటూ ఓ బహిరంగ సమావేశంలో పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ మూడు నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో పవన్ మళ్లీ ముఖానికి రంగు ఎప్పుడు వేసుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవన్ రీఎంట్రీ ఏ సినిమాతో ఉంటుందనే ఆసక్తి కూడా నెలకొంది. ఆల్రెడీ ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆల్రెడీ చిత్రీకరణ దశలోకి వెళ్లగా.. ఇప్పుడు ‘ఓజీ’ కూడా అదే బాటలో సాగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. స్వయంగా ‘ఓజీ’ నిర్మాత డీవీవీ దానయ్య దీని గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఆయన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ మీడియా మీట్‌లో హీరో నాని ‘ఓజీ’ గురించి దానయ్యను అప్‌డేట్ అడగడం విశేషం. దానికాయన బదులిస్తూ.. “ఓజీ త్వరలోనే విడుదల అవుతుంది. షూటింగ్ కూడా అతి త్వరలోనే మళ్లీ మొదలుపెడుతున్నాం” అని చెప్పారు. దీంతో అక్కడున్న అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం ‘ఓజీ’ టీం కొత్త షెడ్యూల్ కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. పవన్ వీలును బట్టి ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ షూటింగ్స్‌లో మార్చి మార్చి పాల్గొంటారని సమాచారం. కాగా సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ఓజీ’ నుంచి ఓ పాటను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
This post was last modified on August 21, 2024 5:08 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…