మెగా అభిమానులు ఇప్పుడు మామూలు ఉత్సాహంలో లేరు. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన కెరీర్లోనే బిగ్టెస్ట్ హిట్లలో ఒకటైన ‘ఇంద్ర’ను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఎన్నో రీ రిలీజ్‌లు చూశాం. ఇందులో ప్రత్యేకత ఏముంది అనిపించవచ్చు.
కానీ ఇప్పటిదాకా వచ్చిన అన్ని రీ రిలీజ్‌ల కంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడమే కాదు.. అవన్నీ హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి. పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, తమిళనాడు.. యుఎస్.. యూకే.. ఇంకా పలు చోట్ల ఈ సినిమా రిలీజవుతోంది. అన్ని చోట్లా రెస్పాన్స్ అదిరిపోతోంది. రీ రిలీజ్ పరంగా అన్ని రికార్డులనూ ‘ఇంద్ర’ దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. దాని దెబ్బకు కొత్త సినిమాలు కూడా బెంబేలెత్తుతున్నాయి.
ఇలాంటి టైంలో ‘ఇంద్ర’ రీ రిలీజ్ హంగామాను మరింత పెంచుతూ మెగాస్టార్ చిరంజీవి లైన్లోకి వచ్చారు. ‘ఇంద్ర రీ రిలీజ్‌పై తన ఉత్సాహాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇంద్ర, ఇంద్రసేనా రెడ్డి అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో మొదలుపెట్టి ఈ డైలాగ్ ఇప్పుడు చెబుతున్నా తనకు గూస్ బంప్స్ వస్తున్నాయని చిరు చెప్పాడు.
ఇంద్ర రిలీజైనపుడు తాను ఎంత ఎగ్జైట్మెంట్‌తో ఉన్నానో.. ఇప్పుడు రీ రిలీజ్ గురించి తెలిసి కూడా అంతే ఆనంద పడుతున్నానని చిరు చెప్పాడు. తన కెరీర్లో అత్యున్నత సాంకేతిక విలువలు, గొప్ప కమర్షియల్ హంగులతో తెరకెక్కిన సినిమా ఇదని చిరు చెప్పారు.
ఈ క్రమంలోనే నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు బి.గోెపాల్.. రచయితలు పరుచూరి బ్రదర్స్.. సంగీత దర్శకుడు మణిశర్మ.. ఇతర టెక్నీషియన్లు, నటీనటులకు చిరు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. అసలే ‘ఇంద్ర’ రీ రిలీజ్ హంగామా పీక్స్‌లో ఉండగా.. చిరు స్వయంగా దీన్ని ప్రమోట్ చేస్తూ వీడియో పెట్టడంతో అభిమానుల్లో జోష్ ఇంకా పెరగడం ఖాయం.
This post was last modified on August 20, 2024 7:28 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…