ఈ వారం విడుదల కాబోతున్న కొత్త సినిమాల్లో అంతో ఇంతో సౌండ్ చేసే అవకాశం ఉన్నది మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఒక్కటే. నిజానికి ఆగస్ట్ 23 దీని రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వచ్చిన వారానికే దిగడం రిస్కేమోనని అందరూ భావించారు. తీరా చూస్తే అవి డిజాస్టర్ కావడంతో ఎక్కువ స్క్రీన్లు అందుబాటులోకి వచ్చాయి. మంచి జోరు మీదున్న ఆయ్, అంతకు ముందు కమిటీ కుర్రోళ్ళు అదే ఊపుని కొనసాగించేలా ఉండగా కంటెంట్ మాత్రమే గెలిచిన ఆగస్ట్ లో ఈ సుబ్రహ్మణ్యం ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. అయితే నక్కతోక పదం వెనుక కారణముంది.
మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో హీరో రావు రమేష్. కేవలం ఈయన కోసమే థియేటర్లకు టికెట్లు కొనుక్కుని రావడం కష్టం. సినిమా చాలా బాగుందనే టాక్ రావాలి. అది జరగాలంటే ముందు ఓపెనింగ్స్ అందుకోవాలి. దాని కోసమే రేపు అల్లు అర్జున్ ని ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒప్పించారు. ఒక రోజు ముందే ఆగస్ట్ 22 సాయంత్రం స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. ఆయ్ లో మెప్పించిన అంకిత్ కొయ్య ఇందులో కీలక పాత్ర పోషించాడు. డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు మైత్రి తీసుకుంది. కథ నచ్చేయడంతో సుకుమార్ తన భార్యను భాగస్వామిగా మార్చారు. ఎంతో నమ్మితేనే ఇలా చేస్తారు కదా.
సో బాగుందనే మాట బయటికి వస్తే మారుతినగర్ సుబ్రహ్మణ్యంకు జాక్ పాట్ తగిలినట్టే. అటుపై ఎలాగూ సరిపోదా శనివారం ఉంటుంది కనక వీలైనంత మొదటి వారంలోనే రాబట్టుకోవాలి. టీమ్ మాత్రం విజయం పట్ల చాలా నమ్మకం ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు సోలో హీరోలుగా చేసిన సినిమాలు, దక్కిన సినిమాలు వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. రావు రమేష్ తండ్రి స్వర్గీయ రావుగోపాలరావు గారు మా ఊళ్ళో మహాశివుడు, కలియుగ రావణాసురుడు లాంటి టైటిల్ రోల్స్ సినిమాలు కొన్ని చేశారు. కొన్ని హిట్టయ్యాయి కూడా. మరి వారసుడు కూడా అదే బాట పడతారో లేదో చూడాలి.
This post was last modified on August 20, 2024 3:45 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…