సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఒకప్పుడు తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లతో సమానంగా మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారాయన. నరసింహా, చంద్రముఖి, శివాజీ రోబో, కబాలి, 2.0 లాంటి చిత్రాలకు జరిగిన బిజినెస్, వచ్చిన ఓపెనింగ్స్ చూసి ఇక్కడి ట్రేడ్ పండిట్లు షాకైపోయారు.
రజినీ సినిమాకు పోటీగా వేరే చిత్రాలను రిలీజ్ చేయడానికి కూడా భయపడ్డారు. కానీ గత కొన్నేళ్లలో రజినీ సరైన సినిమాలు చేయకపోవడం వల్ల మార్కెట్ బాగా దెబ్బ తింది. పేట, దర్బార్, పెద్దన్న లాంటి చిత్రాలకు ఘోరమైన ఫలితాలు వచ్చాయి. రజినీ మార్కెట్ పూర్తిగా కరిగిపోయిన భావన కలిగింది ఆ టైంలో. కానీ గత ఏడాది ‘జైలర్’ మూవీతో సూపర్ స్టార్ బలంగా పుంజుకున్నారు. ఆ చిత్రం రజినీ దాదాపు 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రజినీకి పూర్వ వైభవం తెచ్చిపెట్టింది తెలుగులో.
మధ్యలో రజినీ ప్రత్యేక పాత్ర పోషించిన ‘లాల్ సలాం’ అనే సినిమా నిరాశపరిచింది కానీ.. అదేమీ సూపర్ స్టార్ కొత్త చిత్రం బిజినెస్ మీద ప్రభావం చూపలేదు. రజినీ దసరా టైంలో ‘వేట్టయాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో ఇంకా టైటిల్ ఖరారు ఖరారు కాలేదు. టీజర్ కూడా ఏమీ రిలీజ్ చేయలేదు.
ఐతే ‘జై భీమ్’తో ప్రశంసలు అందుకున్న జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం.. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ లాంటి మేటి తారాగణం ఉండడంతో ఈ చిత్రానికి ట్రేడ్ వర్గాల్లో మంచి హైప్ ఉంది. తెలుగులో కూడా సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకే విడుదలకు రెండు నెలల ముందే థియేట్రికల్ హక్కులు అమ్ముడైపోయాయి. రూ.15 కోట్లకు ఏషియన్ మూవీస్ సంస్థ ‘వేట్టయాన్’ తెలుగు హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
This post was last modified on August 20, 2024 9:50 am
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…