సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి కొత్త జనరేషన్ వస్తోంది. మహేష్ బాబు అన్నయ్య దివంగత రమేష్ బాబు కొడుకు జయకృష్ణ డెబ్యూకి రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఫోటో షూట్ చేసి జనాల స్పందన తెలుసుకోవడం కోసం సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. స్టయిలిష్ గా మహేష్ కు దగ్గరి పోలికలతో ఉన్న కుర్రాడిలో విషయమైతే కనిపిస్తోంది. చిన్నాన్నలాగా లుక్స్ తో పాటు యాక్టింగ్ కూడా చూపిస్తే అభిమానుల ఆదరణ ఖచ్చితంగా ఉంటుంది. గౌతమ్ డెబ్యూకి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది కాబట్టి ఈలోగా జయకృష్ణ హిట్లు కొడితే హ్యాపీగా సెటిలైపోవచ్చు.
ఈ అబ్బాయి కెరీర్ ని మహేష్ బాబు దగ్గరుండి చూసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించే అన్నయ్య త్వరగా దూరమయ్యాడు. ఒకప్పుడు సామ్రాట్, బ్లాక్ టైగర్, కలియుగ అభిమన్యుడు, బజారు రౌడీ లాంటి సినిమాలతో హీరోగా చేసిన రమేష్ బాబు ఎక్కువ కాలం కొనసాగలేదు. మేకప్ వదిలేసి నిర్మాణం, ఇతర వ్యాపారాలలో బిజీ అయిపోయాడు. ఇప్పుడు జయకృష్ణ కనక కుదురుకుంటే రమేష్ లక్ష్యం ఈ రూపంలో అయినా పూర్తిగా నెరవేరినట్టు అవుతుంది. దర్శకుడు, నిర్మాత, బ్యానర్ తదితర వివరాలేవీ ఇంకా బయటికి చెప్పడం లేదు.
ప్రస్తుతానికి మహేష్ కుటుంబం నుంచి తనతో పాటు సుధీర్ బాబు ఇండస్ట్రీలో ఉన్నారు. సితార యాక్టింగ్ పట్ల ఆసక్తిగానే ఉంది కానీ వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. గౌతమ్ చదువు పూర్తి చేసి, నటన తదితరాలు శిక్షణకు, ఎంత లేదన్నా మొత్తం కలిపి ఇంకో ఏడెనిమిదేళ్లు పట్టొచ్చు. సో జయకృష్ణకి ఇది మంచి ఛాన్స్. ప్రూవ్ చేసుకుంటే కెరీర్ మాములుగా ఉండదు. ఎంత స్టార్ బ్యాక్ అప్ ఉన్నా టాలెంట్, సక్సెస్ రెండూ ఉంటేనే ఇండస్ట్రీలో నెగ్గుకురాగలం. పిక్స్ కు మాత్రం ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఇదే జోష్ సినిమాల్లో చూపిస్తే మటుకు కెరీర్ సెట్టు. నో డౌటు.
This post was last modified on August 20, 2024 9:31 am
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…