మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందు మాంచి హుషారుగా కనిపించాడు దర్శకుడు హరీస్ శంకర్. సినిమా ఫలితం మీద చాలా ధీమాగా ఉన్న ఆయన.. ఉత్సాహంగా మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు.
కానీ ఆయన సినిమా గురించి చెప్పిన మాటలకు.. సినిమాలో కంటెంట్‌కు పొంతన లేకపోయింది. సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అందులోనూ పోటీలో వేరే సినిమాలుండడం దీనికి చేటు చేసింది. ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ బాగా లేదు.
ఐతే సినిమా గురించి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు హరీష్ శంకర్. తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన హరీష్.. పనిగట్టుకుని ఈ చిత్రం గురించి కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించాడు.
‘‘సోషల్ మీడియాలో ట్రోల్స్ నాకు కొత్త కాదు. అలానే సోషల్ మీడియా మాత్రమే జీవితం కాదు. గబ్బర్ సింగ్ సినిమాలో ‘నేను ఆకాశం లాంటి వాడిని. ఉరుము వచ్చినా పిడుగు వచ్చినా ఇలాగే ఉంటా’ అనే డైలాగ్ నాకు ఇష్టం. నా వ్యక్తిత్వం కూడా అలాంటిదే. గతంలో రవితేజ సినిమాలకు కొన్నింటికి వచ్చిన రెస్పాన్స్ నిరాశ పరిచాయి. కానీ ఆ దర్శకుల మీద లేని ఎటాక్ నా మీద జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను టార్గెట్ చేసి నెగెటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఒక డ్యాన్స్ మూమెంట్ తీసుకుని సినిమాను విమర్శిస్తున్నారు. కానీ ఇందులో మంచి డైలాగులున్నాయి. ‘కట్నం తీసుకుని కాపురం చేసే మగవాడు వ్యభిచారం చేసినట్లు లెక్క’ అని రాశాను. దాన్ని పట్టించుకోలేదు. ఆ డైలాగ్ నచ్చిందని చాలామంది అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పారు. హీరో ఓ సందర్భంలో ‘నీకు నా ప్రేమ అర్థమయ్యే వరకు నిన్ను కదిలించను’ అంటాడు. అమ్మాయిలు ‘నో’ చెబితే గౌరవించాలనే ఉద్దేశంతో ఆ డైలాగ్ రాశా. దీని గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. మంచిని పక్కన పెట్టి వాళ్లకు సౌలభ్యంగా ఉన్న వాటిని తీసుకుని విమర్శించేవారిని పట్టించుకోనవసరం లేదు’’ అని హరీష్ అన్నాడు.
This post was last modified on August 20, 2024 7:23 am
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…