బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్త్రీ 2 అరాచకం సృష్టిస్తోంది. ఆగస్ట్ 15 ఎంత గొప్ప డేటో, దాన్ని వదులుకోవడం వల్ల పుష్ప 2 ఎంత పెద్ద పొరపాటు చేసిందో వసూళ్ల సాక్షిగా నిరూపిస్తోంది. నార్త్ లో అంటే ఏదో అనుకోవచ్చు కానీ దక్షిణాది తెలుగు తమిళ రాష్ట్రాల్లో సైతం హౌస్ ఫుల్ బోర్డులతో షాక్ ఇచ్చింది. ట్రేడ్ టాక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లను దాటేసిన ఈ హారర్ డ్రామా ఇంకో పది రోజుల పాటు ఇదే దూకుడు కొనగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో యాప్ లో 8 లక్షలకు దగ్గరగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోవడమే ఈ సునామికి ప్రత్యక్ష సాక్ష్యం.
స్త్రీ 2తో పాటు విడుదలైన ఏ భారతీయ సినిమా కనీసం దీని పదో వంతులో లేకపోవడం గమనార్హం. ఖేల్ ఖేల్ మే, వేదా అడ్రెస్ లేకుండా పోగా డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ కు కనీస స్పందన కరువయ్యింది. శ్రద్ధా కపూర్ స్టార్ డం ఒక్కసారిగా మరింత పెరిగిందని అభిమానులు సంబరపడుతున్నారు. ఆడపిల్లలను మాయం చేసే ఓ దెయ్యంని పట్టుకునే నలుగురు మగాళ్ల గ్యాంగ్ తో రూపొందిన స్త్రీ 2లో హారర్, కామెడీని రెండింటిని సమాంతరంగా బ్యాలన్స్ చేయడంతో అన్ని వర్గాలను ఆకట్టుకుంది. సహజంగా వీటికి దూరంగా ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం కదిలి రావడం విశేషం.
ఇప్పుడీ బ్లాక్ బస్టర్ రీమేక్ హక్కులకు డిమాండ్ ఏర్పడింది. స్త్రీ స్ఫూర్తిగా కొన్ని సినిమాలు ఇతర భాషల్లో వచ్చాయి యధాతథంగా స్టోరీని కాపీ కొట్టలేదు. ఒకవేళ ఎవరైనా తీయాలనుకుంటే నేరుగా స్త్రీ 2 రీమేక్ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడిందని సమాచారం. హిందీలో ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ దక్కినందుకు ట్రేడ్ ఆనందంగా ఉంటే మన దగ్గర మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లు దారుణంగా దెబ్బ కొట్టాయి. ఆయ్, కమిటీ కుర్రోళ్ళు కనక మెప్పించకపోయి ఉంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. మంచి సీజన్ ని ప్యాన్ ఇండియా సినిమాలు వదిలేయడం విచారకరం.
This post was last modified on August 19, 2024 2:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…