ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజి (ప్రచారంలో ఉన్న టైటిల్) లో హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ ఎంపిక కావడంతో ఒక్కసారిగా మూవీ లవర్స్ దృష్టి ఆమె మీద పడింది. సోషల్ మీడియాలో నిత్యం మునిగి తేలేవాళ్లకు పరిచయం అక్కర్లేదు కానీ సగటు ప్రేక్షకులకు మాత్రం తెలియని బాపతే. ఆ కథా కమామీషు ఏంటో చూద్దాం. ఇమాన్వి పుట్టింది ఢిల్లీలో. డాన్స్ అంటే మహా పిచ్చి. ఎంబిఏ లాంటి ఉన్నత చదువులు చదివినా నృత్యం పట్ల అభిరుచిని వదులుకోకుండా నిత్యం ప్రాక్టీస్ చేస్తూ కొత్త తరహా రీతులను కనిపెట్టేందుకు కష్టపడేది.
ఇదంతా గమనించిన తండ్రి కూతురు ఆసక్తిని గమనించి యూట్యూబ్ ఛానల్ పెట్టేందుకు ప్రోత్సహించాడు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఇమాన్వి ఫుల్ టైం డాన్సర్ గా మారిపోయింది. ఈవెంట్స్, రీల్స్ అంటూ నిత్యం ఇదే ప్రపంచంగా ఉండిపోయింది. ఇన్స్ టాలో ఇప్పటికే ఏడు లక్షల ఫాలోయర్లు తన సొంతం. ఇమాన్వికి తల్లి సహకారం ఎంతో ఉంది. బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్స్ రేఖ, వైజయంతి మాల లాంటి వాళ్ళ గురించి చూపిస్తూ డాన్స్ ఎలా మెరుగు పరుచుకోవాలో సలహాలు ఇచ్చేది. ముఖ్యంగా ఎక్స్ ప్రెషన్ల విషయంలో ఇమాన్వి చేసిన కసరత్తు లక్షలాది అభిమానులను తెచ్చింది.
అలా హను రాఘవపూడి దృష్టిలో పడి టాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగమం చేసుకుంది. పీరియాడిక్ ఫిలిం కావడంతో పాత్రకు చాలా స్కోప్ ఉంటుంది. అందాల రాక్షసి నుంచి సీతారామం దాకా ఆయన సినిమాల్లో హీరోయిన్ కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఇమాన్వికి అలాంటి బ్రేక్ దక్కుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఇవాళ ఓపెనింగ్ సందర్భంగా ప్రభాస్ ని చూస్తూ మురిసిపోతూ, చుట్టూ ఉన్న వాతావరణానికి ఉద్వేగానికి గురవుతూ ఆమె ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక టాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టడమే ఆలస్యం. అదెంతో దూరంలో లేదు.
This post was last modified on August 17, 2024 10:05 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…