తుపాకీ తర్వాత తెలుగులోనూ మార్కెట్ పెంచేసుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం సెప్టెంబర్ 5 విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే వచ్చిన లిరికల్ సాంగ్ లో విజయ్ వయసుని తగ్గించేందుకు వాడిన డీ ఏజింగ్ టెక్నాలజీ మీద కామెంట్లు వచ్చిన నేపథ్యంలో అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. ఇవాళ ఆ లాంఛనం పూర్తి చేశారు. నాగచైతన్యకు కస్టడీ లాంటి డిజాస్టర్ ఇచ్చిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన గోట్ లో పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉంది. కథేంటో చెప్పీ చెప్పకుండా తెలివిగా మూడు నిమిషాల ట్రైలర్ కట్ చేశారు. మ్యాటరేంటో చూద్దాం.
ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ లో గూఢచారిగా పని చేసిన గాంధీ (విజయ్) కి ఎంతో అనుభవం ఉంటుంది. భార్య (స్నేహ) దగ్గర కూడా కొన్ని రహస్యాలు దాస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఎన్నో ప్రమాదకరమైన మిషన్లను పూర్తి చేసిన గాంధీకో సమస్య వస్తుంది. అందులో అనుకోకుండా కొడుకు (విజయ్) ని కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. ప్రమాదకరమైన శత్రువు (మౌనరాగం మోహన్) నుంచి తప్పించుకుంటూ విదేశాల వీధుల్లో తండ్రి కొడుకులు టెర్రరిస్టులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరి అందులో వాళ్ళు గెలిచారా లేదా అంటే ఇంకో పద్దెనిమిది రోజుల్లో తేలనుంది.
భారీ నిర్మాణ విలువలతో విజువల్స్ బాగున్నాయి. కామెంట్స్ ఎన్ని వచ్చినా విజయ్ పోషించిన కుర్రాడి పాత్ర ఇందులో కొంచెం కన్విన్సింగ్ గానే అనిపిస్తోంది. మొత్తం మూడు షేడ్స్ ని రివీల్ చేసిన వెంకట్ ప్రభు టీనేజ్ లో ఉన్న మరో విజయ్ షాట్ ని చూపించి సస్పెన్స్ పెంచాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా స్నేహ మిసెస్ గాంధీగా చేసింది. సిద్దార్థ్ నుని ఛాయాగ్రహణం, యువన్ శంకర్ రాజా సంగీతం పోటీ పడ్డాయి. సామాన్య మాస్ ప్రేక్షకులకు కొంచెం కన్ఫ్యుజింగ్ గా అనిపించే కాన్సెప్ట్ తో వస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం చెప్పినట్టుగా సెప్టెంబర్ 5నే ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది.
This post was last modified on August 17, 2024 9:55 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…