ఇండిపెండెన్స్ డే వీకెండ్లో తెలుగులో అత్యధిక అంచనాలతో వచ్చిన సినిమా.. మిస్టర్ బచ్చన్. మాస్ రాజా రవితేజ హీరో కావడం.. హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసిన సినిమా కావడం.. పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ స్ట్రైకింగ్‌గా అనిపించడం అందుక్కారణం. పైగా హిందీలో హిట్టయిన రైడ్ మూవీకి రీమేక్ కావడంతో ఇది స్యూర్ షాట్ హిట్ అనే అభిప్రాయం కలిగింది. అందుకే టీం కూడా ధీమాగా రిలీజ్‌కు ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేసింది. కానీ తీరా చూస్తే సినిమా అంచనాలకు తగ్గట్లు లేదు. ముందు షోలు వేయడం సినిమాకు చేటు చేసింది. నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయి.. రిలీజ్ రోజు థియేటర్లలో ఆక్యుపెన్సీలు పడిపోయాయి.
ఇలా పోటీ ఉన్న టైంలో కంటెంట్ వీక్‌గా ఉన్న సినిమా బలైపోతుంటుంది. ‘మిస్టర్ బచ్చన్’ విషయంలో అదే జరుగుతోంది. దీంతో పాటుగా రిలీజైన సినిమాలతో పోలిస్తే ఇది ప్రేక్షకులకు లాస్ట్ ఛాయిస్ అవుతోంది. క్రేజీ వీకెండ్లో వచ్చిన సినిమా కాబట్టి ఓ మోస్తరు వసూళ్లయినా ఉన్నాయి కానీ.. లేదంటే ‘మిస్టర్ బచ్చన్’కు ఇంకా గడ్డు పరిస్థితులు తప్పేవి కావు.
‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఇటు హీరో రవితేజ, అటు దర్శకుడు హరీష్ శంకర్ ఇమేజ్‌లకు కచ్చితంగా డ్యామేజ్ చేసేదే. అసలే రవితేజకు ఈ మధ్య విజయాల్లేవు. హరీష్ సంగతి చూస్తే చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమా చేస్తే అది తేడా కొట్టేస్తోంది. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా వాళ్లకు కూడా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతోంది.
ఇలా వీళ్లందరికీ ‘మిస్టర్ బచ్చన్’ ఇబ్బందిగా మారగా.. ఒక్క హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు మాత్రం ఈ చిత్రం బాగానే కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్లు ఆమెను మాత్రం మెచ్చుకుంటున్నారు. తన అందచందాలు రిలీజ్‌కు ముందే చర్చనీయాంశం అయ్యాయి. సినిమా ప్రోమోలన్నింట్లోనూ ఆమే హైలైట్ అయింది. సినిమాలో కూడా తనను హరీష్ చాలా అందంగా చూపించాడు. నటన కూడా నాట్ బ్యాడ్ అనిపించింది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని మార్కులు కొట్టేసింది. కాబట్టి ‘డీజే’ ఫ్లాప్ అయినా పూజా హెగ్డే కెరీర్ ఊపందుకున్నట్లు ‘మిస్టర్ బచ్చన్’ రిజల్ట్ తేడా కొట్టినా భాగ్యశ్రీకి కెరీర్‌కు మాత్రం ఢోకా లేనట్లే.
This post was last modified on August 17, 2024 3:47 pm
సామాన్యులకు తట్టని అర్థం కాని విధంగా సినిమాలు తీసినా అన్ని వర్గాలను మెప్పించడం ఉపేంద్ర స్టైల్. 'ఏ'తో దాన్ని ముప్పై…
ప్రపంచ టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు పేరుపొందిన ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ‘‘ఎక్స్ మెయిల్’’ పేరుతో…
భారత యువ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి రూ. 11.34…
బాలీవుడ్ లోనే కాదు మనకూ బాగా పరిచయమున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్. సుమంత్ ప్రేమకథతో టాలీవుడ్ కు…
క్రిస్మస్ పండక్కి బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ ఉంటుందని భావించారు ముందు. కానీ ఆ సీజన్ దగ్గర పడేసరికి కథ…