అసలు ఇంత పోటీ మధ్య రిలీజ్ చేయడం అవసరమా అని కామెంట్లు ఎదురుకున్న సినిమా ఆయ్. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ తో పాటు స్త్రీ 2 లాంటి క్రేజీ బాలీవుడ్ మూవీస్ మధ్య దిగితే లేనిపోని రిస్క్ అనుకున్నవాళ్లే అధిక శాతం. కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. టాలీవుడ్ వరకు అన్నింటిలోకి పాజిటివ్ రెస్పాన్స్, రివ్యూలు వచ్చింది ఆయ్ కే. కొత్త కథేమీ లేకపోయినా కాలక్షేపానికి ఢోకా లేకుండా దర్శకుడు అంజి కె మణిపుత్ర తీసిన తీరు యూత్ తో పాటు క్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ల వైపు తీసుకొచ్చేలా చేస్తోంది.
క్షేత్ర స్థాయిలో ఉన్న రిపోర్ట్ మేరకు ఆయ్ థియేటర్లు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా చోట్ల ఆగస్ట్ పదిహేను రెండు మూడు షోలతోనే సర్దుకోవాల్సి వచ్చిన ఆయ్ మెల్లగా ఆ నెంబర్ ని పెంచుకుంటూ పోతోంది. రవితేజ, రామ్ కు ఎక్కువ స్క్రీన్లు కేటాయించిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు అవసరానికి తగ్గట్టు వాటిని ఆయ్ కు ఇవ్వడం మొదలుపెట్టారు. నిన్న సక్సెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్ చెప్పింది కూడా ఇదే. కంటెంట్ బలంగా ఉంటే ఎంత పోటీ అయినా తట్టుకుని నిలబడవచ్చనేది మరోసారి ఋజువవుతోంది. ప్రస్తుతానికి నెంబర్లు మరీ భారీగా లేవు కానీ రికవరీ వేగంగా జరగడం ఖాయం.
మిగిలిన సినిమాలకు వచ్చిన బ్యాడ్ టాక్ ఆయ్ కు వరంగా మారుతున్న మాట వాస్తవం. కామెడీ, తండ్రి సెంటిమెంట్, సంగీతం లాంటి అంశాలు విజయానికి దోహదం చేస్తున్నాయి. కాకపోతే జాతిరత్నాలు రేంజ్ లో హడావివి కనిపించడం లేదు. మ్యాడ్ మొదటి రోజే చాలా వేగంగా పికప్ చూపించింది. కానీ పోటీ వల్ల ఆయ్ కు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. స్టార్లు ఉన్నారు కదాని మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లకు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న ప్రేక్షకులే ఎక్కువ. మెల్లగా ఆయ్ గురించి తెలుసుకుంటున్నారు. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి హిట్టుగా నిలబడుతుందనేది వేచి చూడాలి.
This post was last modified on August 17, 2024 10:30 am
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…