అక్షయ్ కుమార్ అంటే బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడు. ఆయన సినిమాలు ఒకప్పుడు వందల కోట్ల వసూళ్లు రాబట్టేవి. కానీ కొన్నేళ్లుగా అక్షయ్ స్టార్ డమ్ కరిగిపోతూ వస్తోంది. తన సినిమాలకు ఓపెనింగ్స్ ఉండట్లేదు. అక్షయ్ నటించిన కొన్ని మంచి సినిమాలు సైతం వసూళ్లు రాబట్టలేక డిజాస్టర్లు అయ్యాయి.
గత కొన్నేళ్లలో ఆయన చూసిన హిట్ అంటే.. అతిథి పాత్ర చేసిన ఓఎంజీ-2 మాత్రమే. ఈ ఏడాది వేసవిలో అక్షయ్ నుంచి వచ్చిన బడేమియా చోటేమియా బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ఈ మధ్యే అక్షయ్ నుంచి సఫీరా అనే మరో సినిమా రిలీజైంది. ఇంతకుముందు అక్షయ్ సినిమాలు రిలీజయ్యాక ఫ్లాప్ అయ్యేవి. కానీ ఇది రిలీజ్‌కు ముందే డిజాస్టర్ అని తేలిపోయింది. ఈ పేరుతో సినిమా వచ్చినట్లు కూడా జనాలకు తెలియదు. అంత దారుణంగా ఆడింది. ఐతే ప్రతి ఫ్లాప్ తర్వాత ఆశగా అక్షయ్ అభిమానులు మరో సినిమా వైపు చూడడం మామూలైపోయింది.
అలాగే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వచ్చిన ఖేల్ ఖేల్ మే మీద ఫోకస్ పెట్టారు.కానీ పెద్దగా బజ్ లేకుండా రిలీజైన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపట్లేదు. క్రేజీ వీకెండ్లో రిలీజైనా సరే.. ప్రేక్షకుల దృష్టిని ఈ చిత్రం ఆకర్షించలేకపోతోంది. ఈ వారం స్త్రీ-2, వేదా చిత్రాలు కూడా రిలీజ్ కాగా.. వాటి వెనుక మూడో స్థానానికి పరిమితమైంది ఖేల్ ఖేల్ మే.
స్త్రీ-2 బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంటే.. ఖేల్ ఖేల్ మే తేలిపోతోంది. ఐతే ఖేల్ ఖేల్ మేలో అక్షయ్ చేసింది లీడ్ రోల్ కాదు. వేరే ముఖ్య పాత్రల్లో తనదీ ఒకటి. స్క్రీన్ టైం పూర్తి స్థాయిలో ఉండదు. అయినా దీన్ని అక్షయ్ సినిమాగానే భావించాలి. దీనికి ఇలాంటి నిరాశాజనక ఫలితం వస్తుంటే.. ఈ వీకెండ్లో బ్లాక్‌బస్టర్ ఫలితాన్ని అందుకుంటున్న స్త్రీ-2లోనూ అక్షయ్ నటించాడు.
అందులో అతడిది కొన్ని నిమిషాలు కనిపించే క్యామియో రోల్. ఆ సినిమాకే కాదు.. పాత్రకూ మంచి స్పందన వస్తోంది. కానీ ముఖ్య పాత్ర పోషించిన సినిమా వెలవెలబోతుంటే.. క్యామియో రోల్ చేసిన సినిమా ఇరగాడేస్తున్న నేపథ్యంలో అక్షయ్‌కు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి తలెత్తుతోంది.
This post was last modified on August 17, 2024 10:28 am
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…
ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా…
తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు ఏ పత్రికను చూసినా… ఏ ఛానెల్ ను చూసినా…వాటి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు…