ఒక క్రేజీ వీకెండ్లో ఒకటికి మించి పేరున్న సినిమాలు రిలీజైనపుడు.. అన్నింట్లో టాక్ బాగున్న సినిమా అదరగొట్టేస్తుంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతుంది. అదే సమయంలో అంత పోటీ మధ్య వచ్చిన చిత్రాల్లో దేనికైనా టాక్ తేడా కొడితే అంతే సంగతులు. ఆ సినిమా స్పీడుగా సైడైపోతుంది. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఇలాంటి పరిస్థితే తలెత్తింది. తెలుగులో ఒకటికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. స్ట్రెయిట్ మూవీస్ అయిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, ఆయ్‌తో పాటు అనువాద చిత్రం తంగలాన్ ఈ వీకెండ్లో రిలీజయ్యాయి.
వీటిలో అన్నింట్లోకి మంచి టాక్ తెచ్చుకున్న ఆయ్ సినిమా షో షోకు కలెక్షన్లు పెంచుకుంటోంది. డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి నాట్ బ్యాడ్ అన్నట్లుంది. తంగలాన్ దాని స్థాయిలో అది పర్వాలేదనిపిస్తోంది. ఎటొచ్చీ మిస్టర్ బచ్చన్ పరిస్థితే ఇబ్బందికరంగా మారింది. ఇంత పోటీ మధ్య చిన్న సినిమా అయిన ఆయ్ నలిగిపోతుందని అనుకుంటే.. ఆశ్చర్యకరంగా అన్నింట్లోకి క్రేజ్‌తో రిలీజైన మిస్టర్ బచ్చన్‌కు ఆల్రెడీ గట్టి దెబ్బ తగిలేసింది.
మిస్టర్ బచ్చన్‌కు వచ్చిన నెగెటివ్ టాక్ అంతకంతకూ పెరుగుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా రిలీజ్ ముంగిట ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లలో చెప్పిన మాటలకు.. సినిమాలో విషయానికి పొంతన లేకపోవడంతో సోషల్ మీడియాలో అతడిని ఒక ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఎక్కడెక్కడో పాజిటివ్ ట్వీట్లు ఏరుకొచ్చి పోస్ట్ చేసి సినిమా హిట్ అని చాటాలని హరీష్ చూస్తున్నాడు కానీ.. అంతకు వంద రెట్లలో నెగెటివ్ పోస్టులు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.
ముఖ్యంగా సితార్ సాంగ్‌లో స్టెప్పులు, హీరోయిన్ని ప్రెజెంట్ చేసిన విధానం హరీష్‌కు తిట్లు తప్పట్లేదు. ఈ పాటలో పాకెట్ స్టెప్ మీద ఇంతకుముందే విమర్శలు వచ్చాయి. దాన్ని హరీష్ బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. కానీ దాన్ని మించి శృంగారభరితంగా, ఇంకా చెప్పాలంటే ఎబ్బెట్టుగా ఉన్న స్టెప్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
అసలే తన వయసులో సగం లేని హీరోయిన్లను జోడీగా పెట్టుకుని వీర లెవెల్లో రొమాన్స్ చేస్తాడని రవితేజ మీద కామెంట్లు వస్తుంటాయి. ఇప్పడు ఈ స్టెప్ చూశాక విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. దర్శకుడిని కూడా కలిపి అంటున్నారు నెటిజన్లు.
This post was last modified on August 17, 2024 10:28 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…