ప్రస్తుతం టాలీవుడ్లో మంచి రైజింగ్ మీద ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పూజా హెగ్డే డౌన్ అయిపోయాక నంబర్ వన్ హీరోయిన్ స్థానానికి శ్రీలీల గట్టి పోటీదారుగా మారింది. ఆల్రెడీ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్‌తో ‘గుంటూరు కారం’ చేసిన శ్రీలీల.. దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో పాటు నితిన్‌తో ‘రాబిన్ హుడ్’లోనూ నటిస్తోంది. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజతోనూ సినిమాకు ఓకే చెప్పింది. ఇలా మంచి ఊపులో సాగుతున్న శ్రీలీల కెరీర్.. బాలీవుడ్ వైపు కూడా టర్న్ తీసుకుంటోంది. ఆల్రెడీ హిందీలో ‘దిలేర్’ అనే ఓ చిన్న సినిమా చేస్తోంది శ్రీలీల. ఐతే ఇప్పుడు బాలీవుడ్లో ఓ పెద్ద ఆఫరే ఆమె పట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ అప్ కమింగ్ స్టార్లలో ఒకడైన సిద్దార్థ్ మల్హోత్రా సరసన శ్రీలీల నటించబోతోందట.
బల్వీందర్ సింగ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘మిట్టి’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలిసింది. ఇదొక యాక్షన్ టచ్ ఉన్న ఫ్యామిలీ డ్రామా అని సమాచారం. శ్రీలీలకు ఇందులో ఓ మంచి పాత్రే దక్కిందట. ప్రస్తుతం టాలీవుడ్లో హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరైన సంయుక్త సైతం బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ సైతం ‘తెరి’ రీమేక్‌తో బాలీవుడ్లో అడుగు పెడుతోంది.
వీరి కోవలోనే శ్రీలీల సైతం హిందీ సినిమా వైపు చూస్తోంది. ఐతే సౌత్ హీరోయిన్లు బాలీవుడ్లో క్లిక్ అయిన సందర్భాలు తక్కువే. అయినా సరే.. దేశమంతా పాపులర్ అయిన హిందీ చిత్రాల్లో అవకాశాలు వస్తే ఎవరు మాత్రం కాదంటారు. మరి బాలీవుడ్ స్టైల్‌కు తగ్గట్లు తన అప్పీయరెన్స్, యాక్టింగ్‌ను శ్రీలీల మార్చుకుని అక్కడా తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.
This post was last modified on August 15, 2024 11:06 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…