ఇంకో ఎనిమిది రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు రానుంది. విశ్వంభర టీజర్ తో పాటు ఇంద్ర రీ రిలీజ్ ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకునేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ కొత్త సినిమా ప్రకటన ఏమైనా వస్తుందానే సస్పెన్స్ ఇంకా తీరడం లేదు.
దర్శకులు కలుస్తున్నారు, కథలు వింటున్నారు కానీ ఖచ్చితంగా ఫలానాది ఫైనలవుతుందని చెప్పలేమని మెగా కాంపౌండ్ టాక్. హరీష్ శంకర్ తొలుత ప్రయత్నించి కుదరకపోవడంతో రామ్ తో ప్రాజెక్టు లాక్ చేసుకున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉంటాడు.
అనుదీప్ లాంటి కుర్ర డైరెక్టర్లు సైతం ట్రై చేశారు కానీ డిస్కషన్ల దగ్గరే ఆగిపోయింది. సాలిడ్ గా కనిపిస్తున్న అప్డేట్ ఒకటే. మోహన్ రాజా దర్శకత్వంలో బివిఎస్ రవి అందించిన కథ కనక ఫైనల్ వెర్షన్ ఒకే అయ్యుంటే ఆగస్ట్ 22 దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావొచ్చు.
ఒకవేళ ఇంకా ఏకాభిప్రాయం కుదరని పక్షంలో వాయిదా వేయొచ్చు. ఇది కాకుండా ఇంకేదయినా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. విశ్వంభర షూట్ దాదాపు పూర్తి కావొస్తుంది. సో చిరు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ఎక్కువ గ్యాప్ లేకుండా కొత్త సినిమా సెట్లో అడుగు పెట్టొచ్చు.
ఈ సస్పెన్స్ తీరాలంటే ఇంకో వారం ఎదురు చూడక తప్పదు. ఒకవేళ ప్రకటన లేకపోతే మాత్రం విశ్వంభర టీజర్ తో సర్దుకోవాల్సి రావొచ్చు. ఇంద్ర గురించి కూడా ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ఓ స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కనిపిస్తోంది.
భోళా శంకర్ తర్వాత వేగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఆచితూచి అడుగులు వేస్తున్న చిరంజీవి ఇకపై బాలకృష్ణ తరహాలో కొత్త జెనరేషన్ దర్శకులతో పని చేయాలని చూస్తున్నారు. బాబీ, వసిష్ఠ లాంటి వాళ్ళు ఆ అవకాశాన్ని చక్కగా వాడుకున్నారు. మెహర్ రమేష్ పాత స్కూల్ లోనే ఉండిపోయి డిజాస్టర్ ఇచ్చాడు. నెక్స్ట్ లక్కీ ఛాన్స్ ఎవరిదో మరి.
This post was last modified on August 15, 2024 6:38 am
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…