పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాల్లో ఆయనతో సహా అభిమానుల ప్రాధాన్య క్రమంలో ముందు వరసలో ఉన్నది ఓజినే. ఫ్యాన్స్ కు దీని గురించి తప్ప వేరే ఆలోచన లేదు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సైతం వరసలో ఉన్నప్పటికీ సర్వం ఓజి మయం అనే తరహాలో నామ స్మరణ చేస్తున్నారు.
నిన్న జరిగిన సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత డివివి దానయ్య మాట్లాడేందుకు మైకు తీసుకుంటే చెవులు చిల్లులు పడేలా ఓజి నినాదంతో హోరెత్తించారు. వెనుక ఉన్న నానితో పాటు అందరూ నవ్వుతూ షాక్ తిన్నారు తప్పించి అంతకన్నా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.
రెండు ఒకటే బ్యానర్ కావడం వల్ల ఇలా అరిచారు అనుకున్నా వేడుకకు వచ్చిన అత్యధిక శాతం జనాల్లో నానితో పాటు పవన్ ఫాలోయర్స్ చాలా ఎక్కువగా ఉన్న విషయం అర్థమైపోయింది. ఓజిలో హీరోయిన్ ప్రియాంక మోహనే కాబట్టి అల్లరి మరింత ఎక్కువయ్యింది. ఆఖరికి ఎస్జె సూర్య మాట్లాడుతున్నా కొందరు వదల్లేదు.
ఆయన ఖుషి నాటి జ్ఞాపకాన్ని పంచుకున్నప్పుడు ఒక్కసారిగా సుదర్శన్ థియేటర్ షేక్ అయ్యింది. ఈ లెక్కన రిలీజ్ రోజు ఏపీ డిప్యూటీ సీఎం గారి సినిమాకు ఏ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయో ఊహించుకోవడం కష్టంగానే ఉంది. ఆ స్థాయిలో రికార్డులు వస్తాయి.
కాకపోతే పవన్ కాస్త పాలన వ్యవహారాల నుంచి పక్కకువచ్చి సినిమాల వైపు దృష్టి సారించేందుకు టైం పట్టేలా ఉంది కాబట్టి వెయిటింగ్ టైం ఎక్కువగానే ఉండనుంది. ఏఎం రత్నం ఇటీవలే చెప్పిన ప్రకారం ముందు హరిహర వీరమల్లు పూర్తి చేయాలి.
సమాంతరంగా ఓజికి డేట్స్ ఇవ్వొచ్చు కానీ రెండు గెటప్ ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి సాధ్యం కాకపోవచ్చు. ఎలా చూసుకున్నా ఏది ముందు వచ్చినా వెనక్కు వచ్చినా 2025 వేసవి కంటే ముందు పవన్ కళ్యాణ్ కొత్త రిలీజ్ ఉండటం జరగదు. అందుకే సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ సంబరాల కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సిద్ధమవుతున్నారు.
This post was last modified on August 15, 2024 6:38 am
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…