Movie News

పేపర్ కప్పులో టీ కూడా అస్పృశ్యతే-పా.రంజిత్

ఇండియాలో మిగతా ఫిలిం ఇండస్ట్రీలతో పోలిస్తే తమిళ సినీ పరిశ్రమ భిన్నం. అక్కడ సామాజిక అంశాల మీద చాలా సినిమాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక వెనుకబాటు, కుల వివక్ష, అస్పృశ్యత లాంటి అంశాల ఆధారంగా తరచుగా సినిమాలు తెరకెక్కుతుంటాయి. కొందరు దర్శకులు ఈ తరహా చిత్రాలకు బాగా పేరుపడ్డారు. అందులో పా.రంజిత్ ఒకరు.

దర్శకుడిగా తన తొలి చిత్రం ‘అట్టకత్తి’తో మొదలుపెడితే.. మద్రాస్, కబాలి, కాలి.. ఇలా ప్రతి చిత్రంలోనూ అతను కుల వివక్ష మీదే కథను నడిపించాడు. తన ప్రొడక్షన్లో వచ్చిన ‘పరియేరుం పెరుమాళ్’ లాంటి సినిమాల్లోనూ దళితుల సమస్యలు, వారి పోరాటం గురించి అర్థవంతమైన చర్చ జరిగేలా చేశాడని అతడికి మంచి పేరుంది. సినిమాల ద్వారా దళితుల వాయిస్‌ను బలంగా వినిపించడమే కాక.. బయట కూడా ఈ అంశం మీద ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు రంజిత్. ఐతే కొన్నిసార్లు తన అభిప్రాయాలు, వాదనలు వివాదాస్పదం అవుతుంటాయి. 

ఇటీవల ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం పా.రంజిత్ తప్పుబడుతూ పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఐతే రిజర్వేషన్ల ఫలాలను ఇప్పటికే ఎంతో అనుభవించి ఆర్థికంగా స్థిరపడ్డ వారిని పక్కన పెట్టి.. వెనుకబడ్డ వారికే రిజర్వేషన్లు దక్కేలా వర్గీకరణ చేయాలనే డిమాండ్‌కు సుప్రీం కోర్టు, ప్రభుత్వాలు మద్దతు పలికితే తప్పేంటన్న చర్చ నడుస్తోంది.

ఈ క్రమంలో రంజిత్‌ను చాలామంది తప్పుబడుతున్నారు. ఇదిలా ఉండగా అస్పృశ్యత, అంటరాని తనం గురించి తాజాగా రంజిత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. ప్రస్తుతం టీ షాపుల్లో గాజు గ్లాసులతో కంటే పేపర్ కప్పుల్లో టీ తాగేవారే సంఖ్య ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రంజిత్ తప్పుబట్టాడు. ఇది అంటరానితనంలో భాగమే అని అతనన్నాడు.

వేరే కులాల వారు తాగిన గ్లాసుల్లో తాము తాగడం ఏంటనే ఉద్దేశంతోనే జనం పేపర్ కప్పుల్ని ప్రిఫర్ చేస్తున్నారన్నది తన ఉద్దేశం కావచ్చు. కానీ దీన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఇక్కడ శుభ్రత అన్నది ప్రయారిటీ తప్ప కులం కోణం ఉండదని.. దీన్ని కూడా అంటరానితనం కోణంలో చూడడం కరెక్ట్ కాదని.. కొందరి ఉద్దేశం అదే అయినా దాన్ని అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on August 14, 2024 8:04 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago