‘అష్టాచెమ్మా’ అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఒక వెలుగు వెలుగుతున్నాడు నాని. నేచురల్ స్టార్ అనే ట్యాగ్‌కు అతను నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నాడనడంలో సందేహం లేదు. సినిమా సినిమాకూ అతను చూపించే వైవిధ్యం, తన నట కౌశలం గురించి ఎంత చెప్పినా తక్కువే.
గత ఏడాది ‘దసరా’ లాంటి ఊర మాస్ మూవీతో మెప్పించి.. ఈ ఏడాది ‘హాయ్ నాన్న’ లాంటి క్లాస్ మూవీతోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ అనే పక్కా కమర్షియల్ మూవీతో రాబోతున్నాడు. అలా అని ఇందులో కథ పరంగా కొత్తదనం లేదా అంటే అదేమీ కాదు.
వైవిధ్యంగా ఉంటూనే మాస్‌ను ఉర్రూతలూగించే సినిమాలా కనిపిస్తోంది ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పటికే సినిమా మీద ఉన్న అంచనాలను ట్రైలర్ ఇంకా పెంచేసింది.
గత ఏడాది ‘దసరా’ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి టాలీవుడ్ షాకైపోయింది. మిడ్ రేంజ్ స్టార్ల సినిమాలు వేటికీ ఇలాంటి ఓపెనింగ్స్ రాలేదు అప్పటిదాకా. ఐతే సినిమాకు కొంచెం మిక్స్డ్ టాక్ రావడం, తెలంగాణ యాస-కల్చర్ డోస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏపీ జనాలు కొంత దీనికి డిస్కనెక్ట్ కావడం వల్ల సినిమాకు లాంగ్ రన్ లేకపోయింది. ఐతే ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ లెక్క వేరు.
ప్రాంతీయ భేదాల్లేకుండా అందరూ ఎంజాయ్ చేసే సినిమాలా కనిపిస్తోంది. అలాగే క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరినీ సంతృప్తిపరిచే కంటెంట్ ఇందులో ఉందనిపిస్తోంది. నానికి నెగెటివిటీ అనేది లేకపోవడం, అందరు హీరోల ఫ్యాన్సూ అతణ్ని ఆదరించడం పెద్ద ప్లస్. కాబట్టి ట్రైలర్ ఉన్నంత బాగా సినిమా కూడా ఉంటే వసూళ్ల పరంగా అద్భుతాలు చూడొచ్చు.
రిలీజ్ టైమింగ్ కూాడా బాగుంది, పైగా సోలో రిలీజ్ కాబట్టి ఓపెనింగ్స్‌తో ‘సరిపోదా శనివారం’ మోత మోగించడం ఖాయం. సినిమా బాగుంటే వసూళ్లు ఊహించని స్థాయిలో ఉంటాయి. నాని మిడ్ రేంజ్ స్టార్లెవ్వరితో పోల్చలేని స్థాయికి ఎదిగిపోవడం ఖాయం. టాప్ లీగ్, మిడ్ రేంజ్ స్టార్ల మధ్య ఒక కొత్త లీగ్‌కు నాని శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.
This post was last modified on August 14, 2024 8:04 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…