Movie News

దయ్యం ముందు స్టార్ హీరోలు దిగదుడుపే

గత నెల రోజులుగా జోష్ లేకుండా సాగిపోతున్న ఇండియన్ బాక్సాఫీస్‌లో ఇండిపెండెన్స్ డే వీకెండ్ హుషారు తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. వివిధ భాషల్లో క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయి ఈ వారాంతంలో. తెలుగులో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి మాస్ మూవీస్ మంచి బజ్ మధ్య రిలీజవుతున్నాయి.

చిన్న సినిమా అయిన ‘ఆయ్’కి కూడా యూత్‌లో క్రేజ్ కనిపిస్తోంది. ఇక తమిళంలో ‘తంగలాన్’ అనే భారీ చిత్రం వస్తోంది. అది తెలుగులోనూ మంచి అంచనాల మధ్య రిలీజవుతోంది.

ఇక హిందీలో అయితే ఈ వీకెండ్లో మూడు క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయి. అవే.. ఖేల్ ఖేల్ మే, వేదా, స్త్రీ-2. ‘ఖేల్ ఖేల్ మే’లో అక్షయ్ కుమార్ సహా భారీ తారాగణం ఉన్నారు. ‘వేదా’లో యాక్షన్ హీరో జాన్ అబ్రహాం హీరో. ‘స్త్రీ’లో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు. తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది.

ఐతే కాస్టింగ్, రేంజ్ పరంగా చూస్తే ‘ఖేల్ ఖేల్ మే’ నంబర్ వన్ స్థానంలో ఉంటే.. ‘వేదా’కు రెండో స్థానం దక్కుతుంది. ‘స్త్రీ-2’ మూడో స్థానంలో ఉంటుంది. కానీ ప్రేక్షకాసక్తిలో మాత్రం ‘స్త్రీ-2’నే ఎక్కువ మార్కులు కొట్టేస్తోంది. ఇది అప్పట్లో సూపర్ హిట్ అయిన ‘స్త్రీ’ మూవీకి సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో మిగతా రెండు చిత్రాలకు ‘స్త్రీ-2’కు పోలికే లేదు. 24 గంటల వ్యవధిలో ‘స్త్రీ-2’ చిత్రానికి 22 వేల టికెట్లు తెగితే.. ఖేల్ ఖేల్ మే, వేదా చిత్రాలకు రెంటికీ కలిపినా అన్ని టికెట్లు అమ్ముడవలేదు. దీన్ని బట్టే దయ్యం సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దాని ముందు స్టార్ హీరోలు నటించిన సినిమాలు వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. టాక్ బాగుంటే ‘స్త్రీ-2’ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. మరి ఖేల్ ఖేల్ మే, వేదా చిత్రాలకు ఎలాంటి టాక్ వస్తుందో.. అవెలా పెర్ఫామ్ చేస్తాయో చూడాలి.

This post was last modified on August 14, 2024 8:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

1 hour ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

2 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

5 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

5 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

6 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

8 hours ago