ప్రస్తుతం రీమేక్ సినిమాలు అనుకున్నంత బాగా ఆడట్లేదన్నది వాస్తవం. ఒక పేరున్న హీరో ఓ రీమేక్ చేస్తున్నాడంటే ప్రేక్షకులు అది ఏ భాషా చిత్రమైనా సరే.. వెతికి మరీ చూసేస్తున్నారు. కథ ముందే తెలిసిపోవడం వల్ల ఎగ్జైట్మెంట్ పోతోంది. ఆ తర్వాత రీమేక్ మూవీని చూస్తూ ఒరిజినల్‌తో పోల్చి చూస్తున్నారు. ఏమాత్రం తక్కువగా అనిపించినా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీమేక్ సినిమాలు తీయడం కత్తి మీద సాములా మారి.. ఈ ప్రయత్నాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
ఐతే ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూటే వేరు. ఆయన కెరీర్లో రీమేక్ సినిమాలు ఎక్కువే కానీ.. ఒరిజినల్‌ను ఉన్నదున్నట్లు తీయకుండా మార్పులు చేర్పులు చేసి.. మసాలా అద్ది సినిమా రూపు రేఖలే మార్చేస్తుంటారు. ఇంతకుముందు గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్.. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ విషయంలోనూ ఆ ఫార్ములానే అనుసరించారు.
‘మిస్టర్ బచ్చన్’ గురువారమే విడుదల కాబోతుండగా.. దీని ఒరిజినల్ ‘రైడ్’ చూసే థియేటర్లకు రావాలని ప్రేక్షకులకు హరీష్ సూచించడం విశేషం. మామూలుగా రీమేక్ సినిమాలు చేసినపుడు.. ఒరిజినల్ చూడొద్దని మేకర్స్ చెబుతుంటారని.. కానీ తాను మాత్రం మాతృకను చూసే రావాలని కోరుతున్నానని హరీష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒరిజినల్ చూసి వస్తేనే.. తాను ఏమేం మార్పులు చేశానో, ఒరిజినల్‌తో పోలిస్తే రీమేక్‌ను ఎంత భిన్నంగా తీర్చిదిద్దానో తెలుస్తుందని ఆయనన్నాడు. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి గట్స్ ఉండాలంటూ హరీష్ మీద సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
తాను రీమేక్ సినిమాలు చేస్తానని ఎవ్వరైనా విమర్శలు చేస్తే వారి పట్ల జాలి పడతానని హరీష్ ఇంతకుముందే ఓ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీమేక్ సినిమాలు చేయడం అంత తేలిక కాదని కూడా ఆయనంటుంటాడు. మరి ‘రైడ్’ చూసి వెళ్లిన వారిని హరీస్ ఏ రకంగా సంతృప్తిపరుస్తాడో ఈ రోజు పడుతున్న ప్రిమియర్ షోలతోనే తేలిపోతుంది.
This post was last modified on August 14, 2024 4:06 pm
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…