ప్రస్తుతం టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. తన అందచందాలు, చలాకీ నటన, డ్యాన్సింగ్ టాలెంట్‌తో ఆమె యువతను బాగానే ఆకట్టుకుంది. ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ కావడంతో శ్రీలీల స్టార్ స్టేటస్ సంపాదించేసింది. ఇప్పటికే ఆమె తెలుగులో అరడజను చిత్రాల్లో నటించేసింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘గుంటూరు కారం’ కూడా ఉండడం విశేషం.
ఐతే వరుసగా ఫ్లాపులు ఎదురు కావడంతో శ్రీలీల జోరు కాస్త తగ్గినట్లు అనిపించింది కానీ.. తనకు సినిమాల విషయంలో అయితే ఢోకా లేదు. ఉస్తాద్ భగత్ సింగ్, రాబిన్ హుడ్ లాంటి క్రేజీ చిత్రాలు చేతిలో ఉన్నాయి. కొత్తగా రవితేజ సినిమాను కూడా ఒప్పుకుంది.
కాగా ఇప్పుడు ఓ ప్రతిష్టాత్మక సంస్థలో శ్రీలీలకు సినిమా కన్ఫమ్ అయింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్‌లో ఆమె నటించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవిందే వెల్లడించారు. గీతా ఆర్ట్స్-2 ప్రొడక్షన్లో వచ్చిన కొత్త చిత్రం ‘ఆయ్’ ప్రమోషనల్ ఈవెంట్‌కు శ్రీలీల హాజరైంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఆమెను పక్కన పెట్టుకుని మాట్లాడుతూ.. శ్రీలీలను ఈ ఈవెంట్‌కు పిలవడానికి తమ టీం కాల్ చేస్తే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా ఇస్తారనుకుంటే ఈవెంట్‌కు పిలుస్తారా అని జోక్ చేసిందని.. తను చాలా కష్టపడి చాలా దూరం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిందని అరవింద్ చెప్పారు.
ఐతే ఈ స్టేజ్ మీదే తనకు చెబుతున్నా అంటూ తమ సంస్థలో రాబోతున్న ఓ సినిమాలో శ్రీలీల ఓ మంచి పాత్ర చేయబోతోందని వెల్లడించారు. అరవింద్ ఇంత ప్రత్యేకంగా చెప్పారంటే బన్నీ సరసన ఏమైనా శ్రీలీల ఛాన్స్ కొట్టేస్తుందేమో చూడాలి.
This post was last modified on August 14, 2024 4:03 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…