మెహర్ రమేష్‍తో సినిమా చేస్తున్నట్టు చిరంజీవి కూడా అధికారికంగా ప్రకటించేసారు. అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలయ్యేదీ ఆయన స్పష్టత ఇవ్వలేదు. లూసిఫర్ రీమేక్ వినాయక్‍తో, వేదళాం రీమేక్ మెహర్‍తో ఖాయం చేసుకున్నారు. లూసిఫర్ గురించి వినాయక్ వైపు నుంచి ఎలాంటి అప్‍డేట్ లేదు. కానీ మెహర్ రమేష్ సినిమా మాత్రం ఏదో ఒక రకంగా వార్తల్లో నానుతూనే వుంది.
ఇంకా చెప్పాలంటే ముందుగా రావాల్సిన ‘ఆచార్య’ కంటే ఈ చిత్రం గురించే మీడియాలో ఎక్కువగా రాస్తున్నారు. రాక రాక వచ్చిన అవకాశాన్ని ఎలాగయినా సద్వినియోగం చేసుకోవాలని, మెగాస్టార్ మనసు మార్చుకోకముందే ఈ చిత్రానికి అన్నీ ఖాయం చేసేసి పెట్టేయాలని మెహర్ తొందర పడుతున్నట్టున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక ట్యూన్ రెడీ చేయించేసాడట. తాజాగా కెజిఎఫ్ ఫైట్ మాస్టర్లను తీసుకెళ్లి చిరంజీవితో మీటింగ్ పెట్టించాడట.
అలాగే సాయి పల్లవిని చెల్లెలి పాత్రకు ఓకే చేయడం కోసం ఇప్పట్నుంచే ఆమె మేనేజర్ చుట్టూ తిరుగుతున్నాడట. ఆచార్య షూటింగ్ పూర్తయ్యేలోగా ఈ చిత్రానికి అన్నీ సిద్ధం చేసేసి, లూసిఫర్ కంటే ముందు ఈ చిత్రాన్ని మెగాస్టార్ మొదలు పెట్టేలా చేయాలనేది మెహర్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాత అంటున్నారు కానీ ఇంతవరకు అధికారికంగా ధృవీకరించలేదు.
This post was last modified on September 27, 2020 3:47 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…