సెన్సార్ బ్యాన్ చేసిన మూవీ ఆహాలోకి

తెలుగువారి ఓటీటీ ‘ఆహా’లో చాలా వరకు సంప్రదాయబద్ధమైన సినిమాలు, సిరీస్‌లే కనిపిస్తాయి. కొన్ని వయొలెంట్ థ్రిల్లర్స్.. రొమాంటిక్ మూవీస్ రిలీజ్ చేశారు కానీ.. ఫుల్ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్‌లు మాత్రం ఇందులో రిలీజ్ కాలేదు. ఆ విషయంలో నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్స్‌కు.. ఆహాకు పోలికే లేదు.

ఐతే ఇప్పుడు ఆహా కూడా బోల్డ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో తొలిసారిగా ఒక పూర్తి స్థాయి బోల్డ్ మూవీ రిలీజ్ కాబోతోంది. అదే.. ఎవోల్ (Evol). ఈ టైటిల్ చూస్తే అర్థం కానట్లుగా అనిపిస్తుంది. ఐతే ‘Love’ అనే పదాన్ని రివర్స్ చేసి సినిమాకు టైటిల్‌గా పెట్టారన్నమాట. ఈ చిత్రాన్ని సెన్సార్ వాళ్లు థియేటర్లలో రిలీజ్ చేయకుండా బ్యాన్ చేసిన సినిమా కావడం గమనార్హం. అంత వివాదాస్పదమైన సినిమాను ఆహా వాళ్లు రిలీజ్ చేస్తున్నారు.

‘ఎవోల్’ చిత్రాన్ని రామ్ వెలగపూడి అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. ఇందులో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను బ్యాన్ చేసింది. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడానికి ఆల్ట్ బాలాజీ అనే స్పెషల్ ఓటీటీ ఉంది. మరి దాన్ని సంప్రదించారో లేదో తెలియదు కానీ.. ఊహించని విధంగా ఆహా లాంటి ట్రెడిషనల్ ఇమేజ్ ఉన్న ఓటీటీలో దీన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15 కానుకగా ఈ ‘ఎవోల్’ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ కూడా చేశారు.

రెండు జంటల మధ్య జరిగే కథను బోల్డ్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే. లవ్ అనే టైటిల్‌ను తిరగేశారు అంటే లవ్ తిరగబడి లస్ట్‌గా మారితే ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో. మరి సెన్సార్ బోర్డు బ్యాన్ చేసే స్థాయిలో ఈ ‘ఎవోల్’ మూవీలో బోల్డ్ కంటెంట్ ఏముందో చూడాలి మరి.