బాలీవుడ్ హీరోయిన్ల గురించి ఏదో ఒక దశలో ఎఫైర్ వార్తలు రాకపోతే ఆశ్చర్యపోవాలి. ఏ ఎఫైర్ లేకుంటే ఇక్కడ పాపులారిటీ రావడం కూడా కష్టమే. అందుకే కొందరు హీరోయిన్లు కావాలని మీడియాకు లీక్స్ ఇస్తుంటారని కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచితే ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ఆపై బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కృతి గురించి గతంలో కొన్ని ఎఫైర్ వార్తలు వచ్చాయి. కాగా ఈ మధ్య తన గురించి వచ్చిన రూమర్ మాత్రం ఆశ్చర్యకరమైంది.
ప్రస్తుతం కృతికి 34 ఏళ్లు కాగా.. తనకంటే పదేళ్ల చిన్నవాడైన కబీర్ బహియా అనే యూకే వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో పడిందని.. వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారని ఇటీవల బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా దీని గురించి రచ్చ జరుగుతోంది.
ఐతే ఈ రూమర్ల మీద కృతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “నా గురించి తప్పుడు సమాచారం రాసినపుడు నాతో పాటు కుటుంబం కూడా బాధ పడుతుంది. దాని వల్ల వచ్చే పరిణామాలను మేమంతా ఎదుర్కోవాలి. ’34 ఏళ్ల కృతి తనకంటే పదేళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తోంది’ అంటూ హెడ్డింగ్ పెట్టి వార్తలు రాశారు. దీన్ని చాలామంది ఉపయోగించారు. ఏమాత్రం నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు రాసేశారు. ఇది ఈ మధ్య కామన్ అయిపోయింది. సోషల్ మీడియా లేనపుడు పత్రికల్లో వార్తలు చూసి జనం ఒక అభిప్రాయానికి వచ్చేవారు. ఇప్పుడు ఆన్ లైన్లో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ పెట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది. మీరు రాసే వార్తలతో ఎందరో స్పందించి మెసేజ్ చేస్తారు. అవి సులభంగా ప్రజల్లోకి వెళ్లిపోతాయి. వాళ్లందరికీ వివరణ ఇచ్చుకోవడం ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది” అని కృతి పేర్కొంది.
This post was last modified on August 13, 2024 9:16 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…