ఆగస్ట్ 15 విపరీతమైన బాక్సాఫీస్ పోటీ నడుమ ఒక తమిళ డబ్బింగ్ సినిమా జనం దృష్టిలో ఉండటం విశేషమే. అదే తంగలాన్. హీరో చియాన్ విక్రమ్ ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ప్రమోషన్లు చేయకుండా ఏపీ, తెలంగాణలో విస్తృతంగా పర్యటించి తన ప్యాన్ ఇండియా మూవీ గురించి ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్న తమిళనాడులో కాకుండా ఇక్కడ ఫోకస్ పెట్టడానికి కారణం లేకపోలేదు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ నుంచి తంగలాన్ కు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఓపెనింగ్స్ మీద వీటి ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ గమనిస్తే రామ్, రవితేజలున్నంత దూకుడుగా విక్రమ్ కనిపించడం లేదు. పొన్నియిన్ సెల్వన్ వచ్చిన టైంలో కాంపిటీషన్ లేకపోవడంతో పాటు మణిరత్నం బ్రాండ్ తోడై జనం ఆసక్తి చూపించారు. కానీ తంగలాన్ కేసు వేరు. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. గ్లామర్ అంశాలు, మాస్ విజిల్స్ కొట్టించే డైలాగులు, గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ఉండవు. కానీ ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా దర్శకుడు పా రంజిత్ దశాబ్దాల వెనుకటి కథ తీసుకున్నాడు. బంగారం కోసం ఒక అటవీ జాతి చేసే యుద్ధంలో శపించబడిన దెయ్యం వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద రూపొందించారు.
ఇంత కష్టపడి నటించినందుకు, ప్రమోషన్లు చేసుకున్నందుకు విక్రమ్ కు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. జైలర్ తర్వాత తమిళ డబ్బింగులు పెద్దగా ఆడిన దాఖలాలు లేని నేపథ్యంలో తంగలాన్ మీద భారీ బరువు ఉంది. దాన్ని నిలబెట్టుకోవడం కీలకం. విక్రమ్, మాళవిక మోహనన్ తో సహా ఎవరిని అంత సులభంగా పోల్చుకోలేనంత విచిత్రమైన గెటప్పులతో కనిపిస్తున్న ఈ హిస్టారిక్ డ్రామా కనక తెలుగులోనూ హిట్ అయితే నిజంగా హిస్టరీగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి సీజన్ ని తలపించేలా ఆగస్ట్ 15 జరుగుతున్న పోటీలో అనువాదంతో వస్తున్న తంగలాన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on August 13, 2024 12:39 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…