సోషల్ మీడియా లో ఫిల్మ్ సెలబ్రిటీస్ పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది.
అసలు వ్యక్తి గత విషయాలు నలుగురి లో మాట్లాడ కూడదు అనే ఇంగిత జ్ఞానం కూడ లేని వేణుస్వామి వాళ్ళు ఎప్పుడు విడి పోతారో కూడా చెప్పేసాడు.
గతం లో సినిమా రిలీజ్ లపై, రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసు పాలు అయినా కూడ బుద్ది రాని వేణుస్వామి నాగ చైతన్య – శోభిత లపై అలాంటి వ్యాఖ్యలే చేసాడు.
అతనిపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ..
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియి తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద గారికి కలిసి పిర్యాదు చేసారు.
ఈ విషయం పై స్పందించిన ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద గారు వేణుస్వామి పైన మరియు టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ చానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు.
వేణుస్వామి ని పిలిపించి అతని వివరణ అడుగుతామని అన్నారు.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్
లక్షినారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు,
ట్రైజరర్ సురేంద్ర కుమార్ నాయుడు, ప్రసాదం రఘు, లక్ష్మీ (V6),తో పాటు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ ప్రేమమాలిని వనం, సెక్రటరీ వేదుల మూర్తి, మెంబెర్స్ సువర్ణ, తేజస్విని సజ్జ, భాగ్యలక్ష్మి, యస్.కుమార్ మరియు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వనజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
This post was last modified on August 12, 2024 6:16 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…