ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని ఇంద్రని గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తామని గత నెల వైజయంతి మూవీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డేట్ దగ్గర పడుతున్నా ఎలాంటి ప్రమోషన్లు లేవని, కనీసం కౌంట్ డౌన్ పోస్టర్లు కూడా వదలడం లేదని మెగా ఫ్యాన్స్ గత రెండు రోజులుగా ఎక్స్ వేదికగా నిరసన స్వరం వినిపిస్తున్నారు. కల్కి వర్కింగ్ స్టిల్స్ పెట్టడమే తప్ప ఇంద్ర గురించి ఎలాంటి ఊసు లేకపోవడం గురించి కాసింత కోపంగానే ఉన్నారు. ఎప్పుడో ఇరవై రోజుల తర్వాత వచ్చే గబ్బర్ సింగ్ హడావిడిలో కనీసం పావు వంతు కూడా ఇంద్రకు లేదని వాపోతున్నారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇంద్ర రావడం దాదాపు అనుమానమేనట. ఎందుకంటే ఆగస్ట్ 15 పెద్ద ఎత్తున కొత్త సినిమాల పోటీ ఉంది. వారం రెండు వారాలు అగ్రిమెంట్లు చేసుకుని థియేటర్లకు వస్తున్నాయి. అవి ఉండగా ఇంద్రకు సరిపడా స్క్రీన్లు దొరకవు. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపించినా చేతులారా కొత్త చిత్రాల రెవిన్యూని రిస్క్ లో పెట్టినట్టు అవుతుంది. మొన్న మురారి వల్ల కమిటీ కుర్రోళ్ళ వసూళ్లలో కోత పడిందనేది కాదనలేని వాస్తవం. రవితేజ, రామ్, విక్రమ్ లాంటి క్రేజీ హీరోలతో ఇంద్ర పోటీ పడటం సబబు కాదనేది ట్రేడ్ తో పాటు అశ్వినిదత్ బృందం భావిస్తోందట.
దీనికి సంబంధించిన ఏదో ఒక నిర్ణయం ఆగస్ట్ 15 వెలువరించాలని ఫిక్సయ్యారట. ఒకవేళ పోస్టుపోన్ అంటే మాత్రం ఇంకో నెల రెండు నెలలు ఆలస్యం కావొచ్చు. సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ వచ్చాక కొంచెం గ్యాప్ వచ్చేలా చూసుకుంటే బెటర్. లేదూ మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగస్ట్ 22నే రిలీజ్ చేస్తామంటే స్క్రీన్ల సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఏది ఏమైనా మెగాభిమానులు ప్రతికూల ప్రకటనకే ప్రిపేరైతే బెటరేమో. ఎప్పుడు వచ్చినా ఇంద్ర రికార్డులు మ్రోగించడం ఖాయమే. కాకపోతే అది పుట్టినరోజే జరగాలని ఫ్యాన్స్ ఆకాంక్ష. ఏం చేయబోతున్నారో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on August 12, 2024 6:12 pm
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…