మహానటితో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీర్తి సురేష్ ఆ తర్వాత సర్కారు వారి పాట లాంటి కమర్షియల్ సినిమాలో మహేష్ బాబుతో నటించి మెప్పించి తర్వాత స్పీడ్ తగ్గించేసింది. అలాని ఫాలోయింగ్ కు వచ్చిన లోటేమి లేదు కానీ తనని ప్రధాన పాత్రలో పెట్టి తీసిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి లాంటివి డిజాస్టర్లు కావడంతో సోలో బిజినెస్ చేయడం కష్టమైపోయింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే కీర్తి సురేష్ కొత్త మూవీ రఘు తాత ఆగస్ట్ 15 విడుదలకు సిద్ధమయ్యింది. కెజిఎఫ్ నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ కావడంతో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇదంతా బాగానే ఉంది కానీ రఘు తాత తెలుగులో రావడం లేదు. విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో థియేటర్లు అందుబాటులో లేవు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ తో పాటు హిందీ చిత్రాలు స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేదాలకు స్క్రీన్లు సర్దుబాటు చేయడమే మహా కష్టంగా ఉంది. అలాంటప్పుడు బజ్ లేని రఘుతాతని తెలుగులో తీసుకురావడం ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. రవీంద్ర విజయ్ లాంటి తెలిసున్న ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కేవలం కీర్తి సురేష్ ఇమేజ్ మీద మార్కెట్ చేయాలి. ఇప్పుడున్న తక్కువ టైంలో ఇది సాధ్యమా అంటే కాదనే చెప్పాలి.
ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ కనక సూపర్ హిట్ అయితే అప్పుడు ఒక రెండు వారాలు గ్యాప్ తీసుకుని తెలుగులో తెస్తారేమో చూడాలి. దీంతో పాటు డెమోంటి కాలనీ 2 కూడా రావడం లేదు. గతంలో సంక్రాంతి సీజన్ లో ఇదే సమస్య వల్ల అయలన్, కెప్టెన్ మిల్లర్ లు సమాంతరంగా తమిళ తెలుగు రిలీజులు దక్కించుకోలేదు. వీటికి ఒకటి అసలు థియేటర్లకే రాలేదు. మరి రఘుతాతకు ఏమవుతుందో వేచి చూడాలి. వర్కౌట్ అయితే తప్ప దీన్ని ఆశించలేం. టాలీవుడ్ సంగతి పక్కనపెడితే హెవీ కాంపిటీషన్ లోనూ రఘుతాతని ఇంత రిస్క్ చేసి రిలీజ్ చేయడం చూస్తే మ్యాటరేదో బలంగా ఉన్నట్టుంది.
This post was last modified on August 12, 2024 12:18 pm
హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…