పెద్ద నిర్మాణ సంస్థలైనా సరే చిన్న సినిమా తీసినప్పుడు పెద్ద చిత్రాలతో పోటీ పడేందుకు ముందు వెనుకా ఆలోచిస్తాయి. కారణం ఓపెనింగ్స్ తో పాటు మాస్ జనం స్టార్లకు ఇచ్చే ప్రాధాన్యం తమను ఎక్కడ దెబ్బ కొడుతుందోననే అనుమానంతో ఆషామాషీ నిర్ణయాలు తీసుకోవు. కానీ ఆయ్ టీమ్ మాత్రం పెద్ద రిస్క్ కు సిద్ధపడుతోంది. సితార బ్యానర్ నిర్మించిన మ్యాడ్ తో పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె హీరోగా నటించిన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాస్ నిర్మించారు. ఆగస్ట్ 15 సాయంత్రం నుంచి ప్రీమియర్లు మొదలుకాబోతున్నాయి.
ఒకపక్క డబుల్ ఇస్మార్ట్, ఇంకోవైపు మిస్టర్ బచ్చన్. ఇవి చాలవన్నట్టు తమిళ డబ్బింగ్ తంగలాన్. నైజాంలో మూడింటిని మైత్రినే పంపిణి చేస్తోంది. గీతాకు స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బందేం లేదనుకున్నా జనాలను రప్పించేందుకు అది సరిపోదు. కంటెంట్ బలంగా మాట్లాడాలి. సినిమా బాగుందనే టాక్ వస్తే చిన్నా పెద్ద తేడా చూడకుండా ఆడియన్స్ వస్తారు కానీ నచ్చినవన్నీ ఆడేందుకు ఇది సంక్రాంతి సీజన్ కాదు. కాకపోతే ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ తో పాటు రాఖీ పండగ లాంటి వరుస సెలవులు కలిసి రావడం వల్ల అందరికీ ఈ డేట్ మీద కన్ను పడింది.
సో బిగ్ షాట్స్ మధ్య ఆయ్ పరిగెత్తాల్సి ఉంటుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో కుర్రాళ్ళ అల్లరి, సరదా ప్రేమకథలో కులాల ప్రస్తావన లాంటి అంశాలు తీసుకున్న ఆయ్ టీమ్ ఫలితం మీద చాలా ధీమా ఉంది. కొంచెం ఇదే నేపథ్యంలో ఇటీవలే వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సక్సెస్ దీనికి మరింత బలం చేకూర్చవచ్చు కానీ సోలోగా వస్తే కలిగే లాభం కాంపిటీషన్ లో ఉండదుగా. ఎన్నో కథలు విని ఆయ్ ఓకే చేశామని చెబుతున్న బన్నీ వాస్ సినిమాకు దక్కే ఆదరణ పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రీ రిలీజ్ గెస్టులుగా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లను ట్రై చేశారు కానీ నాగచైతన్య వస్తున్నట్టు టాక్.
This post was last modified on August 12, 2024 11:17 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…