Movie News

గాల్లో కలిసిపోయిన బిచ్చగాడి ‘తుఫాన్”

ఒకప్పుడు బిచ్చగాడు రూపంలో పాతిక కోట్ల బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ ఆంటోని కొత్త సినిమా ఒకటి నిన్న రిలీజైన విషయమే జనాలకు రిజిస్టర్ కానంత బలహీనంగా ప్రమోట్ అయ్యింది. కెరీర్ మొత్తం మీద ఇప్పటిదాకా రెండే హిట్లతో నెట్టుకొస్తున్న ఈ తమిళ హీరోకు తెలుగులో మార్కెట్ ఎప్పుడో జీరో అయినా ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చిందే తుఫాన్. నిన్న వారం టాలీవుడ్ లో విపరీతమైన పోటీ ఉండటంతో ఒరిజినల్ వెర్షన్ విడుదలైన వారం తర్వాత తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చారు. ఇంతా చేసి ఈ తుఫాన్ ఎలా ఉందంటే గాలిలో కలిసిపోయిందనే మాట చెప్పొచ్చు.

ముందు కథేంటో చూద్దాం. అండమాన్ లో అండర్ కవర్ లా బ్రతుకుతున్న సలీం (విజయ్ ఆంటోనీ) కి భార్య చనిపోయిన గాయం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడున్న చోటు కూడా చీఫ్ (శరత్ కుమార్) ఆదేశాల మేరకు ఎంచుకున్నదే. స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తూ జనాల రక్తాన్ని జలగలా పీలుస్తున్న డాలీ (పుష్ప ధనుంజయ్) వల్ల బాధితురాలిగా మారిన సౌమ్య (మేఘా ఆకాష్) సలీంకు పరిచయమవుతుంది. ఆమెతో ఏర్పడ్డ బంధం కాపాడే బాధ్యతను తీసుకునేలా చేస్తుంది. అసలు ఇతని వెనుక రహస్య మిషన్ ఏంటి, ఎవరు ఇదంతా చేయిస్తున్నారనే ప్రశ్నకు సమాధానమే తుఫాన్.

దర్శకుడు విజయ్ మిల్టన్ విపరీతమైన హాలీవుడ్ ప్రభావానికి గురై స్టయిలిష్ మేకింగ్ మీద పెట్టిన శ్రద్ధ కథా కథనాల మీద చూపకపోవడంతో తుఫాన్ చాలా నిస్సారంగా సాగుతుంది. టెక్నికల్ గా కొన్ని ఎపిసోడ్స్ బాగానే తీసినప్పటికీ ఆసక్తి కలిగించేలా స్క్రీన్ ప్లే లేకపోవడంతో పరమ రొటీన్ గా భారంగా సాగుతుంది. ధనుంజయ్, సత్యరాజ్, శరత్ కుమార్ లు ఓ మోస్తరుగా నిలబెట్టారు కానీ సింగల్ ఎక్స్ ప్రెషన్ తో విజయ్ ఆంటోనీ చేసిందేమీ లేదు. మురళి శర్మ లాంటి తెలుగు ఆర్టిస్టులు వృథా అయ్యారు. బిచ్చగాడు బ్రాండ్ ని నమ్ముకుని తుఫాన్ వెళ్తే మాత్రంవిసిగించే వర్షంలో తడవడం ఖాయం.

This post was last modified on August 10, 2024 4:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గుట్టు విప్పేస్తున్నారు.. ఇక‌, క‌ష్ట‌మే జ‌గ‌న్..!

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్తు.. ఇక నుంచి జ‌ర‌గ‌బోయేది మ‌రో ఎత్తు. రాజ‌కీయ ప‌రిష్వంగాన్ని వ‌దిలించుకుని.. గుట్టు విప్పేస్తున్న…

2 hours ago

కార్తీ అంటే ఖైదీ కాదు… మళ్ళీ మళ్ళీ పోలీసు

తెలుగు ప్రేక్షకులకు కార్తీ అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమా ఖైదీ. అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయం సాధించి అక్కడి…

4 hours ago

మోహన్ లాల్ స్ట్రాటజీ సూపర్

మలయాళ ఇండస్ట్రీ బాక్సాఫీస్ లెక్కల్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండే హీరో.. మోహన్ లాల్. ఆ ఇండస్ట్రీలో కలెక్షన్ల రికార్డుల్లో చాలా…

5 hours ago

‘అతి’ మాటలతో ఇరుక్కున్న ‘నా అన్వేషణ’

తెలుగు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. అన్వేష్. ‘నా అన్వేషణ’ పేరుతో అతను…

5 hours ago

సైకో పోయినా… ఆ చేష్టలు మాత్రం పోలేదు

2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…

7 hours ago

మిక్కీ జె మేయర్…. మిస్సయ్యారా ప్లసయ్యారా

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…

7 hours ago