స్టార్ వారసత్వం ఉన్నంత మాత్రాన పెద్ద బ్యానర్లలో అవకాశాలు రావొచ్చేమో కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం కత్తుల వంతెన మీద ప్రయాణం చేయాలి. బాలీవుడ్ ఏలిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ తండ్రి స్థాయిని అందుకోలేకపోవడం కంటే వేరే ఉదాహరణ చెప్పాలా.
అందుకే మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. 1979 నీడ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా రంగప్రవేశం చేసిన మహేష్ 1990 బాలచంద్రుడు దాకా బాలనటుడిగా తనదైన ముద్రవేసిన చిచ్చరపిడుగుగా అభిమానుల మనస్సుల్లో ముద్ర వేయడం అప్పటి నుంచే ప్రారంభమయ్యింది.
అన్నయ్య రమేష్ బాబు విఫలమైన చోటే తాను గెలవాల్సిన బాధ్యతను గుర్తు పెట్టుకున్న మహేష్ 1999 రాజకుమారుడుతో హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయంలో తన మీద ఎంత ఒత్తిడి ఉందో తెలిసే కెరీర్ ప్లాన్ చేసుకున్నాడు. మొదటి విజయం ఇచ్చిన నమ్మకం రెండో సినిమా యువరాజులో బిడ్డ తండ్రిగా నటించే ధైర్యాన్ని ఇచ్చింది.
దాని ఫలితం కథల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు ఒక పునాది వేసింది. మురారితో తనలో అసలైన యాక్టర్ ని ప్రపంచానికి పరిచయం చేసిన మహేష్ నిజంతో దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాడు. మహేష్ స్టామినా ఇదని నిరూపించిన ఒక్కడుకి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది.
మాస్ మూవీతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన పోకిరి, టీవీలో వచ్చిన ప్రతిసారి ఛానల్ మార్చలేనంత వ్యసనంగా మారిపోయిన అతడు, స్ఫూర్తి కోసం బిజినెస్ మెన్, ఎమోషన్ కోసం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆదర్శం కోసం మహర్షి ఇలా వైవిధ్యాన్ని కేరాఫ్ అడ్రెస్ గా మార్చుకున్న మహేష్ కు మధ్యలో కొన్ని డిజాస్టర్లు స్పీడ్ బ్రేకర్లలా అడ్డుపడినప్పటికీ అసంఖ్యాకంగా పెరిగిపోతున్న ఫ్యాన్స్ బేస్ ని ఆపలేకపోయాయి. రాజమౌళితో చేయబోయే ప్యాన్ వరల్డ్ మూవీ కోసం ప్రపంచమంతా ఎదురు చూసే రేంజ్ కి మహేష్ చేరుకున్నారు. అందుకే సూపర్ స్టార్ ప్రయాణం చదువుతూనే ఉండాలనిపించే పుస్తకం.
This post was last modified on August 9, 2024 11:46 am
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి జైలు కష్టాలను ఎలాగోలా తప్పించుకున్నా… గుంటూరులోని సీఐడీ…
ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక…
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఎదురైన పాఠాలే.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు భవిష్యత్తు మార్గాలను చూపిస్తున్నాయా? ఆదిశగా…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామవరం మండలం…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) గ్యాస్ ధరలను పెంచుతూ…