రాబోయే సంక్రాంతికి ఖరారుగా వచ్చే సినిమాల్లో అధికారికంగా ప్రకటించుకున్నవి చిరంజీవి విశ్వంభర, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, వెంకటేష్ అనిల్ రావిపూడిల కాంబో మూవీ. ఇవి కాకుండా రవితేజ హీరోగా భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సితార సంస్థ తీస్తున్న ఎంటర్ టైనర్ సైతం పండగ బరిలో దించబోతున్నారు. అయితే ఇక్కడో చిక్కు వచ్చి పడింది. సితార సంస్థలోనే బాలకృష్ణతో బాబీ రూపొందిస్తున్న ఎన్బికె 109 డిసెంబర్ ని ఎంచుకునే అవకాశం క్రమంగా తగ్గిపోవడంతో ఎప్పటిలాగే బాలయ్య సెంటిమెంట్ ని ఫాలో అవుతూ జనవరి పండగకే రిలీజ్ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఒకే సంస్థ నుంచి ఒకే సమయంలో రెండు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయడమనే సంప్రదాయం గతంలో ఉండేది కాదు. కానీ నిన్నటి ఏడాది మైత్రి మూవీ మేకర్స్ దాన్ని వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో విజయవంతంగా బ్రేక్ చేసి చూపించారు. సాధ్యమేనని ఋజువు చేశారు. ఒకవేళ రవితేజ, బాలయ్య ఇద్దరూ సంక్రాంతే కావాలని పట్టుబడితే అప్పుడు మైత్రి స్ట్రాటజీనే ఫాలో కావాలని నిర్మాత నాగవంశీ అనుకున్నట్టు అంతర్గత సమాచారం. అదే జరిగితే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. అన్ని అగ్ర బ్యానర్లు నువ్వా నేనాని థియేటర్ల కోసం యుద్ధాలే చేయాల్సి వస్తుంది.
డిసెంబర్ లో వచ్చే పుష్ప 2 ది రూల్, గేమ్ ఛేంజర్ ఆ సమయానికంతా థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఉంటాయి. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ తో మంచి స్వింగ్ లో ఉన్నా సరే ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంటుంది. పెద్ద హీరోల రిలీజుల విషయంలో నిర్మాతలు ఆరేడు నెలల ముందే అడ్వాన్స్ ప్లానింగ్ లో ఉండటం తప్పడం లేదు. లేదంటే ఆ టైంకి లేనిపోని తలనెప్పులు వచ్చి వ్యవహారం మీడియా గడప దాటి పోతోంది. విజయ్ వారసుడు టైంలో దిల్ రాజు దీన్ని ఎదురుకున్నారు. ఈసారి పరిణామాలు మరింత వేడెక్కేలా కనిపిస్తున్నాయి. ఎవరు నిలుస్తారో ఎవరు తప్పుకుంటారో చూడాలి.
This post was last modified on August 8, 2024 12:32 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…