Movie News

దొమ్మీ గొడవల్లో హీరోని చంపేశారు

మన దేశంలో జరిగింది కాకపోయినా వింటేనే ఒళ్ళు జలదరించే నిజ జీవిత సంఘటన ఇది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీసుకొచ్చిన రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా చెలరేగిన హింస ఎన్ని వందల ప్రాణాలను బలి తీసుకుందో చూస్తున్నాం.

సాక్ష్యాత్తు ప్రైమ్ మినిస్టర్ ఇంటిని లూటీ చేసిన అరుదైన దృశ్యాలు పలు టీవీ ఛానల్స్ లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సంఘటనల్లో ఒక హీరోతో పాటు నిర్మాతైన అతని తండ్రి దారుణ హత్యకు గురి కావడం అక్కడి ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెరమీద మాత్రమే చూసే వయొలెన్స్ రియల్ లైఫ్ లో ఎవరు మాత్రం ఊహించగలరు.

సలీం ఖాన్ అనే వ్యక్తికి నిర్మాతగా బంగ్లాదేశ్ లో మంచి పేరుంది. పలు హిట్ సినిమాలు ఆయన బ్యానర్ నుంచి వచ్చాయి. ఇటీవలే కొడుకు శాంటో ఖాన్ ని హీరోగా పరిచయం చేశాడు. తాజాగా రేగిన అల్లర్లలో ప్రాణ రక్షణ కోసం వాళ్ళ కుటుంబం నివసించే చాంద్ పూర్ అనే ప్రాంతం నుంచి పారిపోతూ మధ్యలో ఫరక్కాబాద్ మార్కెట్ దగ్గర దుండగులకు దొరిపోయారు. అయితే చేతిలో ఉన్న తుపాకీతో గుళ్ళు పేల్చి అక్కడి నుంచి తప్పించుకున్నారు కానీ బగారా అనే ఏరియాకు వచ్చేసరికి బుల్లెట్లు అయిపోయాయి. అప్పటికే అక్కడ గుమికూడిన జనం ఇద్దరినీ అక్కడిక్కడే కొట్టి చంపేశారు.

వీళ్ళ మీద ఇంత ఆగ్రహానికి కారణం లేకపోలేదు. సలీం ఖాన్ ఇటీవలే తుంగి పరార్ మియా భాయ్ అనే సినిమా తీశాడు. షేక్ హసీనా తండ్రి షేక్ ముజబీర్ రెహమాన్ జీవితం ఆధారంగా ఇది రూపొందింది. కొడుకు శాంటో దీని ద్వారానే లాంచ్ అయ్యాడు.

ఇది నిర్మించినందుకే ముష్కర మూకలకు సలీం ఖాన్ టార్గెట్ అయ్యాడు. కన్నబిడ్డతో పాటు తనను తానే కోల్పోయాడు. ప్రస్తుతం ఈయన ప్రొడక్షన్ లో పదికి పైగా సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. అవన్నీ ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. చూస్తుంటే దీని మీద భవిష్యత్తులో ఏదైనా బాలీవుడ్ మూవీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

This post was last modified on August 8, 2024 11:05 am

Share
Show comments
Published by
Satya
Tags: bangladesh

Recent Posts

మారుతికి కొత్త‌ర‌కం టార్చ‌ర్

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండ‌ద‌ని చెబుతూ, ప్ర‌భాస్ అభిమానుల‌కు భ‌రోసానిస్తూ, తేడా…

1 hour ago

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…

2 hours ago

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

2 hours ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

3 hours ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

3 hours ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

6 hours ago