స్వాతంత్ర దినోత్సవం రోజు మాస్ మసాలా విందు వడ్డించేందుకు సిద్ధమవుతున్న మిస్టర్ బచ్చన్ మీద అంచనాలు మాములుగా పెరగడం లేదు. ప్రమోషన్ల విషయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకున్న శ్రద్ధ, దర్శకుడు హరీష్ శంకర్ ఇంటర్వ్యూలు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ షో, ఇవన్నీ ఒక ఎత్తయితే రవితేజ కమర్షియల్ కటవుట్ ఒక్కసారిగా హైప్ ని అమాంతం పెంచేసింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ అయినప్పటికీ దాని ఛాయలు లీలామాత్రం కనిపించేలా ఎన్నో మార్పులు చేశారని పబ్లిసిటీలోనే అర్థమైపోయింది. ఇవాళ ట్రైలర్ రూపంలో మరింత స్పష్టత ఇచ్చేశారు దర్శక నిర్మాతలు.
ఒక ముప్పై ఏళ్ళ వెనుకటి కాలం. తనకిష్టమైన హీరో పేరునే పెట్టుకున్న బచ్చన్ (రవితేజ) మహా అల్లరి టైపు. అలాని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. మాములు ఉద్యోగం కాదు ఏకంగా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అవుతాడు. ఊరిలోనే పేరు మోసిన బిగ్ షాట్ ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) ఇంటి మీద రైడింగ్ కు వెళ్లే బాధ్యతను పై అధికారులు బచ్చన్ కు ఇస్తారు. డ్యూటీ కోసం ఎంత దూరమైనా వెళ్లే ఇతను ముందు వెనుకా ఆలోచించకుండా సవాల్ ని స్వీకరిస్తాడు. ఈ క్రమంలోనే ప్రేమించిన అమ్మాయి (భాగ్యశ్రీ బోర్సే) ని సైతం ఇబ్బందుల్లో పెడతాడు. చివరికి తన లక్ష్యం ఏమయ్యిందో తెరమీద చూడాలి.
ఒరిజినల్ వెర్షన్ ఏ మాత్రం తలుపుకు రాకుండా హరీష్ శంకర్ ఈ మిస్టర్ బచ్చన్ కు చేసిన మార్పులు క్లాస్ కంటే ఎక్కువగా మాస్ కి విపరీతంగా ఎక్కేసేలా ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత రవితేజలోని పవర్ మాస్ ని బయటికి తీసినట్టు కనిపిస్తోంది. క్యాస్టింగ్ తో పాటు అప్పటి వాతావరణాన్ని తలపించేలా ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ అన్నీ పోటీపడ్డాయి. మిక్కీ జె మేయర్ తనలో కమర్షియల్ యాంగిల్ ని పూర్తిగా బయటికి తీశాడు. డబుల్ ఇస్మార్ట్ లాంటి బలమైన పోటీకి సరిపడా కంటెంట్ ఉందనే గ్యారెంటీ అయితే ఇచ్చేశారు. ఆగస్ట్ 14 సాయంత్రం నుంచే ప్రీమియర్ల రూపం బచ్చన్ హంగామా మొదలవుతుంది.
This post was last modified on August 8, 2024 12:41 am
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…