2024లో కొత్త సినిమాలకు ఏమంత కలిసి రావడం లేదు. ఈసారి సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. సంక్రాంతికి వచ్చిన హనుమాన్.. వేసవిలో టిల్లు స్క్వేర్.. ఆ తర్వాత కల్కి మినహాయిస్తే పెద్ద విజయాలు సాధించిన సినిమాలు కనిపించవు. చిన్న సినిమాల పరిస్థితి అయితే దయనీయంగా ఉంది.
మినిమం ఇంపాక్ట్ చూపించకుండా థియేటర్ల నుంచి వెళ్లిపోతున్నాయి. వారం వారం పెద్ద సంఖ్యలోనే సినిమాలు రిలీజవుతున్నా.. వాటిలో ప్రభావం చూపుతున్నవి కనిపించడం లేదు. ‘కల్కి’ తర్వాత గత 40 రోజుల్లో ఒక్క సినిమాకూడా సరిగా ఆడలేదు. గత వారం అరడజను సినిమాలకు పైగా రిలీజైనా ఏదీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ వారం కూడా అరడజను సినిమాలకు పైగానే రిలీజవుతున్నాయి. వాటికి ఓ పాత సినిమా పెద్ద అడ్డంకిగా మారింది. అదే.. మురారి.
ఎప్పుడో 2001లో విడుదలైన చిత్రం.. మురారి. గత రెండేళ్లుగా పాత సినిమాలను రీ రిలీజ్ చేసి సెలబ్రేట్ చేసే ట్రెండు నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ‘మురారి’ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మధ్యలో రీ రిలీజ్ ట్రెండ్ కొంచెం డల్లయినట్లు కనిపించింది. కానీ ‘మురారి’కి మాత్రం బంపర్ క్రేజ్ వచ్చింది. రిలీజ్ ప్లానింగ్ కూడా బాగా చేశారు.
దీంతో విడుదలకు కొన్ని రోజుల ముందే ప్రి సేల్స్‌తోనే రూ.2 కోట్ల వసూళ్లతో కొత్త రికార్డును నెలకొల్పిందీ చిత్రం. ఈ సినిమాకు 9న ఉదయం పూట పెట్టిన షోలు పెట్టినట్లే సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. కొత్తగా ఏదో పెద్ద స్టార్ సినిమా వస్తున్నట్లుగా అర్లీ మార్నింగ్ షోలకు టికెట్లు బుక్ చేయడానికి జనం ఎగబడుతున్నారు. ఎన్నోసార్లు టీవీలో చూసిన పాత సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వస్తుంటే జనం అంత ఆసక్తి చూపిస్తున్నారు కానీ.. ఈ వారం రిలీజయ్యే కొత్త సినిమాలను మాత్రం పట్టించుంటున్న పరిస్థితి కనిపించడం లేదు.
నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రాళ్లు’ సహా చాలా చిన్న సినిమాలు రిలీజవుతున్నా వాటి మీద ఎవరి దృష్టీ నిలవడం లేదు. చూస్తుంటే ‘మురారి’ వాటన్నింటికీ గట్టి పంచే ఇచ్చేలా ఉంది. ఆ చిన్న సినిమాలన్నీ సాధించే వసూళ్ల కంటే ‘మురారి’కే ఎక్కువ కలెక్షన్లు రాబోతున్నాయన్నది స్పష్టం.
This post was last modified on August 7, 2024 11:33 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…