మెహర్ రమేష్… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘బిల్లా’ లాంటి స్టయిలిష్ బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించారు. సినిమాల ఫలితాల సంగతెలా ఉన్నా స్టైలిష్ మేకర్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. మెగాఫోన్‌కు కొంతకాలం దూరమైన రమేష్ త్వరలో ఓ మెగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వేదాళం రీమేక్ చేయబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు, తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆ కథను మెహర్ రమేష్ మార్చారు. ఇందుకోసం మూడేళ్ల పాటు ఆయన కష్టపడ్డారు. ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. మెహర్ రమేష్ చేసిన మార్పులు నచ్చడంతో చిరంజీవి ఆ సినిమా చేయడానికి అంగీకరించారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా గురించి పవన్ కల్యాణ్ ఇటీవల ట్విటర్ ద్వారా స్పందించారు. తాజాగా చిరంజీవి కూడా ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ మెహర్ రమేష్ తో సినిమా చేయబోతున్నట్టు కన్ఫామ్ చేశారు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ కావాలని మెహర్ రమేష్ చాలా పట్టుదలగా ఉన్నారు. త్వరలోనే ఆయన కోరిక నెరవేరనుంది.
This post was last modified on September 25, 2020 11:11 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…