టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి, పెళ్లి కూడా చేసుకుని.. ఆ తర్వాత మోసం చేశాడంటూ వార్తల్లోకి వచ్చిన లావణ్య చౌదరి గురించి గత నెల రోజులుగా మీడియాలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ముందు అందరూ ఈ వ్యవహారంలో రాజ్‌ను ఒక మోసగాడిలాగే చూశారు. బాధితురాలిగా కనిపించిన లావణ్యకే ఎక్కువ మద్దతు లభించింది. ఆమె తరఫున కేసు టేకప్ చేసిన కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా మొదట్లో రాజ్‌కు వ్యతిరేకంగా బలమైన పాయింట్లు చెబుతూ మీడియా దృష్టిని ఆకర్షించాడు. కానీ గత కొన్ని రోజుల్లో వ్యవహారం పూర్తిగా మారిపోయింది. లావణ్య, కళ్యాణ్ దిలీప్ తీరుతో జనాల అభిప్రాయమే మారిపోయే పరిస్థితి వచ్చింది. రాజ్‌కు మద్దతుగా మాట్లాడుతున్న ఆర్జే శేఖర్ బాషాను టీవీ ఛానెల్ లైవ్‌లో లావణ్య చెప్పుతో కొడితే.. మరో సందర్భంలో అతడిని దారుణమైన బూతులు తిట్టి కళ్యాణ్ దిలీప్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఇదే సమయంలో లావణ్యకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ వైరల్ అయింది. అందులో ఆమె భాష, వాడిన బూతులు చూస్తే జనం వామ్మో అని తలలు పట్టుకున్నారు.
ఇలా రోజు రోజుకూ లావణ్య పట్ల అనుమానాలు, వ్యతిరేకత పెరిగిపోతున్న సమయంలో ఇంకో ఇంటర్వ్యూలో లావణ్య మాటలు చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. లావణ్య డ్రగ్స్ కేసులో కొన్ని రోజుల పాటు జైల్లో గడిపినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. తనకు ఏ పాపం తెలియదని.. ఈ కేసులో తనను రాజ్ తరుణే ఇరికించినట్లు ఆమె గతంలో ఆరోపించింది. కాగా ఈ కేసు విషయమై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు నన్ను తీసుకెళ్లారు. ఒకటిన్నర రోజు నన్ను అక్కడే ఉంచారు. ఆ తర్వాత ఈ కేసులో నన్ను ఏ2గా రాసి జైలుకు పంపించారు. మరి రాజ్ తరుణ్ తలుచుకుంటే ఇది నిజంగా అయ్యే కేసే కాదండి. నా దగ్గర 4 గ్రాములు దొరికినా.. అలా దొరికిన వాళ్లు ఎంతమంది డబ్బులిచ్చి వదిలించుకోరండి. నాకు సమస్య వచ్చినా సాయం చేసే పరిస్థితిలో ఉన్న మనిషే. కానీ ఏం చేయలేదు’’ అని లావణ్య చెప్పింది. తన మాటల్ని బట్టి చూస్తే.. తన దగ్గర డ్రగ్స్ దొరికిన మాట వాస్తవమే కానీ.. ఆ కేసులోంచి తనను తప్పించకపోవడం రాజ్ తప్పు అన్నట్లుగా ఉంది. సంబంధిత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇదేం వాదన అంటూ లావణ్యను అందరూ తప్పుబడుతున్నారు.
This post was last modified on August 7, 2024 7:13 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…