మాస్ రాజా రవితేజ పక్కన నటించే హీరోయిన్ల విషయంలో ఈ మధ్య చాలా చర్చ జరుగతోంది. రవితేజ వయసులో సగం వయసు కూడా లేని అమ్మాయిలను తన పక్కన కథానాయికలుగా పెడుతున్నారని.. జోడీ ఏమాత్రం బాగుండట్లేదని సోషల్ మీడియాలో విమర్శలు తప్పట్లేదు. ‘ధమాకా’ సినిమాకు రవితేజ పక్కన శ్రీలీలను పెట్టినపుడు చాలా ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే అనే మరో కొత్తమ్మాయిని పెట్టడం మీదా నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్లు, వీడియో ప్రోమోలు రిలీజైనపుడల్లా దీని మీద సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. వేరే భాషలకు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా దీని గురించి కామెంట్లు చేశాయి. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ స్పందించాడు.
‘‘మీ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేస్తున్నపుడు వయసు మాత్రమే కాక అన్నీ చూసుకుంటారు. అందులో తప్పు లేదు. కానీ ఒక సినిమాలో ఒక హీరో పక్కన నటించే హీరోయిన్ విషయంలో మీకెందుకు ఈ అభ్యంతరాలు? చేస్తున్న అమ్మాయికి అభ్యంతరం లేదు. ఇష్టపూర్వకంగానే సినిమాకు సంతకం చేసింది. సినిమాలో నటించింది. మరి మీ బాధ ఏంటి? సినిమా అంటేనే కల్పితం. అందులో నటీనటులు చేసేది యాక్టింగ్. అలాంటపుడు అభ్యంతరాలు ఏంటి? సినిమాలో హీరో పాత్రకు ఒక వయసు, స్వభావం ఉంటాయి. అవి చూడాలి కానీ.. హీరో వయసంత, హీరోయిన్ వయసింత అనడం ఏంటి? ‘ధమాకా’ సినిమా విషయంలోనూ ఇలాగే అన్నారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఒకప్పుడు ఎన్టీఆర్, శ్రీదేవి జోడీ గురించి కూడా ఎన్నో మాటలు అన్నారు. కానీ వాళ్ల సినిమాలు సెన్సేషనల్ హిట్టయ్యాయి. సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్లే ఇవన్నీ పట్టించుకుంటారు. మామూలు జనానికి ఇవేమీ పట్టవు. సినిమా బాగుందా లేదా అనేదే చూస్తారు’’ అని హరీష్ తేల్చేశాడు.
అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని…
టాలీవుడ్ బాక్సాఫీస్ మరో ఆసక్తికరమైన క్లాష్ కు సిద్ధమయ్యింది. ఆయా హీరోలకు తమ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రెండు…
బాహుబలి స్థాయి సినిమాగా కోలీవుడ్లో ప్రచారం జరిగిన కంగువ సినిమాకు రిలీజ్ ముంగిట తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అటు…
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…