Movie News

తెర మీదే కాదు.. బయటా హాటే

కొందరు హీరోయిన్లు తెర మీద ఎంత సెక్సీగా, హాట్‌గా కనిపించినా.. బయట మాత్రం ట్రెడిషనల్‌గా కనిపించడానికే ప్రయత్నిస్తారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఎక్కడైనా తమలోని హాట్ యాంగిల్ చూపించడానికే చూస్తారు. కెమెరాల ముందు అందాలు ఆరబోయడానికి వెనుకాడరు.

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ కావ్య థాపర్ ఈ కోవకే చెందుతుంది. ఆమె సినిమాల్లో మెరవడానికి ముందే మోడల్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన ఫొటో షూట్లు సోషల్ మీడియాను ఊపేశాయి. ‘ఏక్ మినీ కథ’ అనే చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినప్పటికీ.. అందులో ఒక పాటలో ఆమె అందాల ఆరబోతకు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కెరీర్ పుంజుకోవడానికి కొంచెం టైం పట్టింది కానీ.. ఈ మధ్య ఆమె బిజీ అవుతోంది.

ఈ ఏడాది ఆల్రెడీ ‘ఈగల్’, ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాల్లో మెరిసింది. ఆ సినిమాలు అనుకున్నంతగా ఆడకపోయినా.. కావ్య గ్లామర్ మాత్రం బాగానే హైలైట్ అయింది. ఆ సినిమాల ప్రమోషన్ల టైంలో తన అప్పీయరెన్స్ అందరి దృష్టినీ ఆకర్షించింది. మీడియా వాళ్లు సైతం ప్రెస్ మీట్లలో తన లుక్స్‌ను అభినందించారు.

ఇప్పుడు కావ్య ‘డబుల్ ఇస్మార్ట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పాటలు, ట్రైలర్లో కావ్య ఎంత హాట్‌గా కనిపించిందో తెలిసిందే. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తన క్లీవేజ్ షో తాలూకు ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా కావ్య మీడియాతో చిట్ చాట్‌కు వచ్చింది. ఈ సందర్భంగా కూడా తన హాట్ లుక్స్ అందరి దృష్టినీ ఆకర్షించాయి. సోషల్ మీడియాలో తన ఫొటోలు అప్పుడే తెగ తిరిగేస్తున్నాయి.

This post was last modified on August 6, 2024 9:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: Kavya Thapar

Recent Posts

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

26 minutes ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

26 minutes ago

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

1 hour ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

2 hours ago

ఢిల్లీకి చేరిన ‘తెలుగు వారి ఆత్మ‌గౌరవం’

తెలుగు వారి ఆత్మ గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా త‌మిళ‌నాడు క‌ర్ణాట‌క‌లోని…

3 hours ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

4 hours ago