టాలీవుడ్లో చాలా తక్కువ రీమేక్స్‌లో నటించిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయనకు వేరే భాషా చిత్రాలను రీమేక్ చేయడం పట్ల అంతగా ఆసక్తి ఉండదు. గత 20 ఏళ్ల వ్యవధిలో ఆయన చేసిన రీమేక్ సినిమా ఒక్కటి మాత్రమే. 2004లో వచ్చిన ‘లక్ష్మీనరసింహా’ తమిళ బ్లాక్ బస్టర్ ‘సామి’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఆయన రీమేక్‌ల జోలికే వెళ్లలేదు. పాత క్లాసిక్ ‘లవకుశ’ను ‘శ్రీరామరాజ్యం’ పేరుతో రీమేక్ చేశారే తప్ప.. వేరే భాషా చిత్రాల రీమేక్స్‌లో మాత్రం నటించలేదు.
ఐతే ఇప్పడు ఆయన ఆ ప్రయత్నం చేయబోతున్నారని సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల కిందట మలయాళంలో సంచలనం రేపిన ‘ఆవేశం’ రీమేక్‌లో బాలయ్య నటించబోతున్నాడని ఓ రూమర్ హల్ చల్ చేస్తోంది.
‘పుష్ప’ మూవీతో తెలుగు వారికి కూడా బాగా పరిచయం ఉన్న ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆవేశం’ బ్లాక్ బస్టర్ అయింది. అందులో ఫాహద్ ఒక క్రేజీ క్యారెక్టర్ చేశాడు. తన క్యారెక్టరైజేషన్, పెర్ఫామెన్స్ మీదే ఆ సినిమా ఆడింది. ప్రతి హీరో ఇలాంటి ఒక పాత్ర చేయాలని ఆశపడతాడు.
ఐతే ఫాహద్ స్థానంలో మరో నటుడిని ఊహించుకోవడం కష్టమే. మామూలుగానే రీమేక్‌లను ఇష్టపడని బాలయ్య.. తన శైలికి నప్పని ఇలాంటి పాత్రను చేస్తాడు అంటే నమ్మశక్యంగా అనిపించదు. కానీ బాలయ్యతో వరుసగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా రీమేక్ హక్కులు కొని.. బాలయ్యతో పునర్నిర్మించడానికి ట్రై చేస్తోందని.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంతమేర నిజముందో చూడాలి. బాలయ్య చేస్తే మాత్రం ఇదొక క్రేజీ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 5, 2024 3:20 pm
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…