Movie News

థియేటర్లలో స్మాష్.. మరి ఓటీటీలో?

భారతీయుడు.. సౌత్ ఇండియన్ ఆడియన్స్‌కు ఒక మరపురాని జ్ఞాపకం. ఆ సినిమా వేసిన ఇంపాక్ట్ అలాంటిలాంటిది కాదు. అది సాధించిన విజయం గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇలాంటి ఐకానిక్ మూవీకి 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీసి థియేటర్లలోకి వదిలింది చిత్ర బృందం.

‘భారతీయుడు’ దర్శకుడు శంకరే దీన్ని రూపొందించగా.. కమల్ హాసనే లీడ్ రోల్ చేశారు. కానీ ‘భారతీయుడు-2’ ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ చిత్రం. రూ.250 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. అందులో పదో వంతు షేర్ కూడా రాబట్టలేదు.

ఈ సినిమా రిలీజైనపుడు సోషల్ మీడియాలో మామూలు ట్రోలింగ్ జరగలేదు. శంకర్ కెరీర్లో ఇలాంటి పరాజయం, ఇంత ట్రోలింగ్ ఎప్పుడూ చూసి ఉండడేమో. వీకెండ్లో కూడా ఈ సినిమా నిలబడలేకపోయింది. ఆ తర్వాత పూర్తిగా వాషౌట్ అయిపోయింది.

స్కేల్ ప్రకారం చూసుకుంటే ‘భారతీయుడు-2’ లాంటి భారీ చిత్రాలు ఓటీటీలోకి రావడానికి టైం పడుతుంది. కానీ థియేటర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 9 నుంచి స్ట్రీమ్ చేయబోతోంది.

ఐతే ‘భారతీయుడు-2’ రిలీజైనపుడు సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. శంకర్ లాంటి దర్శకుడు అంత పేలవంగా సినిమా తీశాడా అన్న ఆసక్తితో అయినా ఓటీటీలో ప్రేక్షకులు ఈ సినిమా చూస్తారనడంలో సందేహం లేదు. అలా చూసిన వాళ్లు ఊరికే ఉండరు.

థియేటర్లలో ఎలా భరించారీ సినిమాను అంటూ వాళ్లు కూడా ట్రోలింగ్‌కు దిగడం గ్యారెంటీ. కాబట్టి ఆగస్టు 9 తర్వాత మరి కొన్ని రోజుల పాటు ‘భారతీయుడు-2’ టీంకు బ్యాండ్ తప్పదు అన్నట్లే. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘భారతీయుడు-3’ వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

This post was last modified on August 5, 2024 6:58 am

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

51 minutes ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

2 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

4 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

6 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

7 hours ago