యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, నటిగా బిజీ అయిన అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలో చాలా పాపులర్. బోల్డ్ ఫొటో షూట్లతో ఫ్యాషన్‌కు వయసు అడ్డంకి కాదు అని చాటుతూ ఉంటుందామె. ఐతే ఈ క్రమంలో నెటిజన్ల నుంచి కొన్నిసార్లు వ్యతిరేకత ఎదుర్కొంటూ.. వాళ్లతో వాదనలు పెట్టుకుంటూ ఉంటుంది. ఐతే ఏ సందర్భంలోనూ తగ్గేదే లే అన్నట్లు వాళ్లను ఢీకొడుతూనే ఉంటుంది అనసూయ.
ఒకట్రెండు సందర్భాల్లో మాత్రమే ఆమె హర్టయి కన్నీళ్లు పెట్టుకునే స్థితికి వెళ్లింది. ఆ సందర్భాల్లో కూడా తర్వాత బలంగా పుంజుకుని తన మీద నెగెటివ్ కామెంట్లు పెట్టే నెటిజన్లను ఢీకొట్టుంది. ప్రధానంగా అనసూయ డ్యాన్సింగ్ గురించి.. టీవీ షోల్లో తన మాటలు, ప్రవర్తన గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. ఐతే తన డ్రెస్సింగ్ తన ఇష్టమని.. దాని గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని అంటుంటుంది అనసూయ. ఇక షోల్లో మాట్లాడే మాటలు, చేేసే చేష్టల్ని ప్రొఫెషన్లో భాగంగానే చూడమంటుంది.
ఐతే బయటి వాళ్లు విమర్శించడం, కామెంట్లు చేయడం సంగతి అలా ఉంచితే.. తన ఇంట్లో వాళ్లే తన డ్రెస్సింగ్‌ను విమర్శిస్తారని అంటోంది అనసూయ. తన కొడుక్కి తన డ్రెస్సింగ్ నచ్చదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం ఆశ్చర్యపరిచింది. తాను నడుంపైకి టాప్ వేసుకుంటే అది తన కొడుక్కి నచ్చదని.. ఫుల్ టాప్ వేయమని అంటాడని.. వేరే డ్రెస్సుల విషయంలోనూ ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తాడని అనసూయ చెప్పింది.
ఐతే తన డ్రెస్సింగ్ తన ఇష్టమని.. తనకు ఏది కంఫర్ట్‌గా ఉంటే, తాను ఎలా అందంగా ఉంటే అలా డ్రెస్ చేసుకుంటానని.. ఈ విషయంలో అభ్యంతరపెట్టకూడదని తన కొడుక్కి తాను చెబుతానని అనసూయ వెల్లడించింది.
అంతే కాక తన పిల్లల డ్రెస్సింగ్ విషయంలోనూ తాను వేలు పెట్టనని.. షాప్‌కు తీసుకెళ్లి నచ్చింది తీసుకోమని చెబుతానని ఆమె చెప్పింది. తాను డిగ్రీ వచ్చే వరకు తానేం ధరించాలో తన తల్లిదండ్రులే నిర్ణయించారని.. కానీ తాను మాత్రం తన పిల్లలకు చిన్నతనం నుంచే స్వేచ్ఛ ఇచ్చానని అనసూయ వెల్లడించింది.
This post was last modified on August 5, 2024 6:56 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…