Movie News

ట్రోల్ మెటీరియల్‌గా మారిన సూపర్ స్టార్ పాట

ఇటీవలే స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కంటే కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ గొప్ప డ్యాన్సర్ అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. దాని మీద తెలుగు నెటిజన్లు ఆమె మీద విరుచుకుపడ్డారు. డ్యాన్స్ విషయంలో చిరు ముందు అసలు విజయ్ ఎంత అంటూ ఇద్దరి వీడియోలు తెచ్చి పోస్ట్ చేసి కీర్తిని విమర్శించారు.

ఐతే ఎవరో ప్రూవ్ చేయడం ఎందుకు.. చిరు ముందు తాను ఎంతమాత్రం నిలవజాలనని స్వయంగా తనే నిరూపించేశాడు విజయ్. తన కొత్త చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ నుంచి కొత్త పాట ఒకటి రిలీజైంది.

‘స్పార్క్’ పేరుతో ఈ పాటను లాంచ్ చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాటలో ఏ ప్రత్యేకతా కనిపించలేదు. ట్యూన్‌ సాధారణంగా అనిపించింది. బీట్ అంతంతమాత్రమే. ఇక ఈ పాటలో డ్యాన్స్ స్టెప్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచింది.

విజయ్ బేసిగ్గా మంచి డ్యాన్సరే కానీ.. కొన్ని పాటల్లో పిచ్చి పిచ్చి స్టెప్పులు వేస్తుంటాడు.  అవి ట్రోలింగ్‌కు గురవుతుంటాయి. ‘స్పార్క్’ పాటలో అక్కడక్కడా విజయ్ స్టెప్పులు చూస్తే ఇదేం డ్యాన్స్ అని తలలు పట్టుకోకుండా ఉండలేం. మామూలుగా తెలుగు నెటిజన్లకు చిన్న అవకాశం దొరికినా దాన్ని ట్రోల్ మెటీరియల్‌గా మార్చేస్తుంటారు.

ఇక చిరు కంటే విజయ్ గొప్ప డ్యాన్సర్ అని కీర్తి అన్నాక.. విజయ్ నుంచి ఇలాంటి పాట వస్తే వదులుతారా? రకరకాల మీమ్స్‌తో విజయ్‌ని ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. ప్యాంటు మీద సాంబార్ పడితే తుడుచుకునే స్టెప్ అంటూ ‘దుబాయ్ శీను’లో ఎమ్మెస్ నారాయణ మీద తీసిన ఒక సన్నివేశాన్ని గుర్తు చేసేలా ఉన్న మీమ్ అందులో ఒకటి.

కీర్తి టాపిక్ పక్కన పెట్టి చూసినా ఈ పాటలో విజయ్ స్టెప్స్ చాలా పేలవంగా ఉన్న మాట వాస్తవం. విజయ్ ఫ్యాన్సే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ మీదే కాక.. సంగీత దర్శకుడు యువన్ మీద వాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

This post was last modified on August 5, 2024 6:53 am

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

21 minutes ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

48 minutes ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

56 minutes ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

3 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

3 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

4 hours ago