ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్.. ఇలా హ్యాట్రిక్ హిట్లతో హీరోగా కెరీర్‌ను ఘనంగా ఆరంభించిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్.. ఆ తర్వాత నిఖార్సయిన హిట్ ఒక్కటీ అందుకోలేకపోయాడు.
ఒకప్పుడు తన చిత్రాలు యావరేజ్‌గా అయినా ఆడేవి, వాటికి ఓపెనింగ్స్ అయినా వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఈ హీరో నుంచి రెండు వారాల్లో రెండు సినిమాలు విడుదలైతే.. ఒక్కటీ కూడా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయింది.
ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయి రాజ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గత వారం ‘పురుషోత్తముడు’ అనే సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఆ పేరుతో రాజ్ ఎప్పుడు సినిమా చేశాడో కూడా జనాలకు తెలియదు. సడెన్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ట్రైలర్ వదిలారు. సినిమానూ థియేటర్లలోెకి దించేశారు.
కానీ శ్రీమంతుడు, బిచ్చగాడు లాంటి చిత్రాలకు కాపీలా అనిపించిన ‘పురుషోత్తముడు’ వీకెండ్లోనే వాషౌట్ అయిపోయింది. ఆ సినిమాను రాజ్ తరుణ్ కూడా పట్టించుకోలేదు. కానీ తర్వాతి వారం రిలీజ్‌కు రెడీ అయిన ‘తిరగబడర సామీ’ కోసం ప్రెస్ మీట్లో పాల్గొని ప్రమోట్ చేశాడు.
పబ్లిసిటీ కూడా పర్వాలేదనిపించింది. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి సినిమాలు తీసిన రవికుమార్ చౌదరి తీసిన చిత్రం కావడంతో ఇది ఓ మోస్తరుగా అయినా ఉంటుందనుకున్నారు. కానీ ‘పురుషోత్తముడు’నే ఎంతో నయం అనిపించేంతగా ప్రేక్షకులకు చుక్కలు చూపించేసింది ‘తిరగబడర సామీ’.
రాజ్‌కు ఏమాత్రం సెట్ అవని క్యారెక్టర్ చేశాడిందులో. తొలి రోజు ఉదయం ఓ మాదిరిగా ఆక్యుపెన్సీలు కనిపించాయి కానీ.. మరీ దారుణమైన టాక్ రావడంతో తర్వాత ఈ సినిమా థియేటర్లు వెలవెలబోయాయి. వారం వ్యవధిలో రాజ్ ఖాతాలో రెండో డిజాస్టర్ పడడంతో ఇక తన కెరీర్ ఏమాత్రం పుంజుకుంటుంన్నది సందేహం.
This post was last modified on August 4, 2024 6:14 pm
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…